Breaking News

సెమీకాన్‌ 2.0 వచ్చేసింది!

Published on Tue, 09/01/2026 - 05:27

న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల డిజైన్, తయారీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సోమవారం రూ.1,27,500 కోట్లతో సెమీకాన్‌ 2.0 ప్రోగ్రాంను నోటిఫై చేసింది. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (మెయిటీ) జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆరు మూల స్తంభాలు, 10 కేటగిరీలను పొందుపర్చారు. 

చిప్‌ డిజైన్, సెమీకండక్టర్‌ పరికరాలు, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలు, నిపుణులను తయారు చేసుకోవడమనే ఆరు కీలకాంశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్‌ సెమీకండక్టర్‌ పరిశ్రమలో దాదాపు పది శాతం మార్కెట్‌ వాటాను భారత్‌ దక్కించుకుంటుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ధీమా వ్యక్తం చేశారు. సెమీకండక్టర్‌ పరికరాలు, కెమికల్‌..గ్యాస్‌ తయారీ సంస్థల నుంచి ’సూపర్‌ స్పందన’ వచి్చందని చెప్పారు.

 సెమీకాన్‌ 2.0 ప్రోగ్రాం అనేది దేశీయంగా ఈ వ్యవస్థ మరింతగా వేళ్లూనుకునేందుకు దోహదపడుతుందన్నారు. తొలి విడత స్కీమును ప్రకటించిన తర్వాత ఈ పరిశ్రమలోని రిసు్కలపై అభిప్రాయాలు మారిపోయాయని, అనిశ్చితి తొలగి సెమీకండక్టర్‌ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటూ ఉండటమనేది ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోందని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ పేర్కొన్నారు.  

ఏఐ బూమ్‌తో అధునాతన చిప్స్, మెమొరీలకు అసాధారణ డిమాండ్‌ ఏర్పడటం, అంతర్జాతీయంగా సెమీకండక్టర్లు కీలక వనరుగా మారడం లాంటి పరిస్థితుల్లో చిప్‌ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు, స్టారప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్రం తాజా ప్రోగ్రాంను ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2026 జూలై 15న ఈ స్కీమును క్యాబినెట్‌ ఆమోదించగా, సోమవారం నోటిఫికేషన్‌లో దీని తీరుతెన్నులు, అర్హతా ప్రమాణాలను పొందుపర్చారు.

 ఈ స్కీము కింద రూ. 50 కోట్ల నుంచి రూ. 20,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌తో చేపట్టే చిప్‌ తయారీ, అసెంబ్లీ ప్లాంట్ల పెట్టుబడి వ్యయాల్లో 25–40 శాతం వరకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది. అధునాతన సెమీకండక్టర్‌ టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహించే ప్రాజెక్టులకు అత్యధికంగా 75 శాతం వరకు మద్దతు లభిస్తుంది.  

రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఊతం: ఐఈఎస్‌ఏ 
తాజా స్కీము వచ్చే ఐదేళ్లలో సెమీకండక్టర్‌ వ్యవస్థలో రూ. 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఊతమిస్తుందని పరిశ్రమ సమాఖ్య ఐఈఎస్‌ఏ తెలిపింది. వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 5–7 చిప్‌ తయారీ యూనిట్లు (వేఫర్‌ ఫ్యాబ్‌లు) భారత్‌లో రాగలవని పేర్కొంది. స్కీము కాలవ్యవధిలో రూ. 2 లక్షల కోట్లపైగా విలువ చేసే సెమీకండక్టర్ల ఉత్పత్తికి తోడ్పడేలా రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా స్కీము ఉందని మొబైల్‌ ఫోన్స్‌ తయారీ సంస్థల సమాఖ్య ఐసీఈఏ తెలిపింది.

సెమీకాన్‌ 2.0 కొన్ని విశేషాలు.. 
→ స్కీములో పేర్కొన్న ఆరు మూల స్తంభాల్లో డిజైన్‌కి తొలి ప్రాధాన్యం ఉంటుంది. దీని కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే సంస్థలు భారతీయుల యాజమాన్యంలో ఉంటూ, భారత్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేవై ఉండాలి. ప్రోడక్ట్‌ డిజైన్‌ ఆధారిత ప్రోత్సాహకాల కింద స్టార్టప్‌లు, చిన్న సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) రూ. 15 కోట్ల వరకు లేదా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం సీడ్‌ ఫండింగ్‌ పొందవచ్చు.  

→ వినియోగానికి సంబంధించి డిప్లాయ్‌మెంట్‌ ఆధారిత ప్రోత్సాహకం కింద, కొత్తగా విక్రయాలు మొదలైన చిప్‌లు, ఎస్‌వోసీల నికర అమ్మకాలపై ఐదేళ్ల పాటు 9 శాతం రీయింబర్స్‌మెంట్‌ లభిస్తుంది. ఒక్కో ప్రోడక్టు దరఖాస్తుకు గరిష్టంగా గరిష్టంగా రూ. 30 కోట్లు, ఒక్కో కంపెనీకి గరిష్టంగా రూ. 120 కోట్ల పరిమితి వర్తిస్తుంది.  

→ సిలికాన్‌ సెమీకండక్టర్‌ వేఫర్‌ ఫ్యాబ్‌లకు సంబంధించి, కనీస పెట్టుబడి ప్రమాణం రూ. 20,000 కోట్లు ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముందు మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరంలో కనీసం రూ. 7,500 కోట్ల ఆదాయం కలిగి ఉండాలి. అర్హత కలిగిన ఫ్యాబ్‌ యూనిట్లకి నెలకు కనీసం 40,000 వేఫర్‌ల ఉత్పత్తి సామర్థ్యాలు, టెక్నాలజీ లైసెన్సు ఉండాలి. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాల్లో దాదాపు సగభాగానికి సమానంగా రాష్ట్రాలు కూడా తోడ్పాటు అందిస్తున్నందున.. ఈ తరహా ఫ్యాబ్రికేషన్‌ సంస్థలకు అందించే ఆర్థిక మద్దతును 40 శాతానికి కేంద్రం తగ్గించింది. గత స్కీములో ఇది 50 శాతంగా ఉండేది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇచ్చేది కలిపితే సుమారు 60 శాతం ప్రభుత్వ మద్దతు లభించినట్లవుతుంది. 
 
→ కాంపౌండ్‌ సెమీకండక్టర్లు, ఫొటానిక్స్‌ మొదలైన ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లకు 35 శాతం మేర ఆర్థిక మద్దతు లభిస్తుంది. దీనికి కనీస పెట్టుబడి పరిమాణం రూ. 500 కోట్లుగా, ఆదాయం రూ. 200 కోట్లుగా నిర్దేశించారు. 

→ డిస్‌ప్లే ఫ్యాబ్‌లకు కూడా 35 శాతం మద్దతు లభిస్తుంది. టెక్నాలజీని బట్టి పెట్టుబడి పరిమితులు మారతాయి. ఓఎల్‌ఈడీ, ఎల్‌సీడీ ఫ్యాబ్‌లకు కనీసం రూ. 10,000 కోట్ల పెట్టుబడి, రూ. 5,000 కోట్ల ఆదాయం అర్హతా ప్రమాణాలుగా ఉంటాయి. మైక్రో ఎల్‌ఈడీ ప్రాజెక్టులకు కనీసం రూ. 1,500 కోట్ల పెట్టుబడి, రూ. 600 కోట్ల ఆదాయం ఉండాలి.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)