Breaking News

కార్లు, బైక్‌లు అబ్బో.. అదృష్టమంటే ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులదే!

Published on Sun, 10/13/2024 - 07:50

చెన్నైకి చెందిన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ అద్భుతమైన బహుమతులతో తమ ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగుల్లో మరింత ప్రేరణ కల్పించడానికి, ఉత్పాదకతను పెంచడానికి కంపెనీ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.

2005లో ప్రారంభమైన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్, డిటైలింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కణ్ణన్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, అభినందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ గుర్తింపు ఉద్యోగులను తమ పాత్రల్లో రాణించేలా మరింత ప్రేరేపిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.

ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన కార్లలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ వంటి కంపెనీలతోపాటు మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా ఉండటం విశేషం. కార్లు, బైక్‌లతో పాటు, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తమ ఉద్యోగులకు వివాహ కానుకను కూడా అందిస్తోంది. గతంలో రూ.50,000గా ఉన్న ఈ కానుకను ఈ ఏడాది రూ.లక్షకు కంపెనీ పెంచింది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)