Breaking News

ఆఫీసుల్లోనే ఆగిపోతున్న గుండెలు.. మరో టెకీ మృతి

Published on Sun, 09/29/2024 - 14:14

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని, మృతుడిని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీనియర్ అనలిస్ట్‌ నితిన్ ఎడ్విన్ మైఖేల్ (40) ‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు.

శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లిన మైఖేల్‌ ఎంతకీ బయటకు రాలేదని, సోనెగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి తెలిపారు. అతని సహచరులు వెంటనే అతనిని నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు తరలించగా పరశీలించిన వైద్యులు అతను మృతిచెందినట్లు ప్రకటించారు.

సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్షలో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది.

ఇటీవల కార్పొరేట్‌ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లక్నోలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)