Breaking News

సెమీకండక్టర్ మిషన్‌కు రూ.83 వేలకోట్లు..?

Published on Sat, 09/07/2024 - 13:09

ఇండియన్ సెమీకండక్టర్ మిషన్‌(ఐఎస్‌ఎం) రెండో దశకు 10 బిలియన్ డాలర్లు(రూ.83 వేలకోట్లు) కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా సెమీకండక్టర్ తయారీ, ప్యాకేజింగ్, డిజైనింగ్‌ కోసం ఈ నిధులను ఉపయోగించబోతున్నట్లు ప్రభుత్వ సీనియర్‌ అధికారి తెలిపారు. టవర్‌ సెమీకండక్టర్‌, అదానీ గ్రూప్‌ సంయుక్తంగా చిప్‌ తయారీ ప్లాంట్‌ను తయారు చేయాలని ప్రతిపాదించాయి. అందుకోసం ఈ నిధుల్లో కొన్నింటిని వాడుకోనున్నట్లు తెలిసింది.

దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్‌ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)ను డిసెంబర్‌ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్‌సోర్స్‌డ్‌ అసెంబ్లీ అండ్‌ టెస్టింగ్‌(ఓఎస్‌ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్‌, మార్కింగ్‌, ప్యాకేజింగ్‌(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: మూడు గనుల్లో 40,560 మందికి ఉపాధి

ఐఎస్‌ఎం రెండో దశలో భాగంగా రూ.83 వేలకోట్ల ప్రోత్సాకాలు అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్ సంస్థ, అదానీ గ్రూప్‌ సంయుక్తంగా మెగా సెమీకండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను సిద్ధం చేయాలని యోచిస్తున్నాయి. ఈమేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టాటా గ్రూప్‌ సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)