Breaking News

ఇషా అంబానీ సారథ్యం.. రిలయన్స్ రిటైల్ సరికొత్త రికార్డ్!

Published on Mon, 12/29/2025 - 18:08

ఇషా అంబానీ నాయకత్వంలో.. రిలయన్స్ రిటైల్ 2025లో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఏడాది ముగిసే సమయానికి దేశంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య 7000 కంటే ఎక్కువ నగరాల్లో.. 20వేలకు చేరుకుంది. ఇందులో ఒక బిలియన్ కంటే ఎక్కువ కస్టమర్ లావాదేవీలను నెరవేర్చడమే కాకుండా.. లక్షలాది మంది భారతీయులకు ప్రాథమిక షాపింగ్ గమ్యస్థానంగా దాని స్థానాన్ని బలోపేతం చేసింది.

రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో.. ఫిజికల్ స్టోర్లే మొత్తం వ్యవస్థకు వెన్నెముక అని ఇషా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది వస్తువులను ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లో డెలివరీ చేసేలా లాజిస్టిక్స్‌ను మార్చారు. 600 కొత్త డార్క్ స్టోర్లు ఏర్పాటు చేశారు. జియోమార్ట్ 1,000కి పైగా నగరాల్లో విస్తరించింది. Ajio Rush ద్వారా ఫ్యాషన్ ఉత్పత్తులు కూడా డెలివరీ చేయడం ప్రారంభమైంది. ఇవన్నీ కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడ్డాయి.

గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను.. భారతీయులకు చేరువ చేయడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'షీన్' బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావడం ద్వారా లక్షలాది మంది యువతను ఆకట్టుకున్నారు. ఫ్రెంచ్ బ్రాండ్ Maje, యువత కోసం Yousta, Azorte వంటివాటిని పరిచయం చేశారు. వీటికి పట్టణాల్లో మంచి ఆదరణ లభించింది.

ప్రజలను ఆకట్టుకునే ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో.. రిలయన్స్ రిటైల్ ఆర్థికంగా 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ FMCG విభాగం, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), దాని రెండవ సంవత్సరంలోనే రూ.11,500 కోట్ల మైలురాయి టర్నోవర్‌ను సాధించింది. రాబోయే రోజుల్లో కంపెనీ ఏటా 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌