Breaking News

క్లాసులకు వెళ్తున్న ఇషా అంబానీ.. టీచర్‌ ఏమన్నారంటే..

Published on Wed, 09/24/2025 - 15:34

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) అధినేత, భారత అపర సంపన్నుడు ముకేశ్‌ అంబానీ ( Mukesh Ambani), నీతా అంబానీల (Nita Ambani) ముద్దుల తనయ ఇషా అంబానీ. వీరి నుంచే వ్యాపార పటిమను అలవరచుకున్న ఈమె రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లోని పలు అనుబంధ విభాగాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె చాలా కాలంగా వీక్లీ క్లాసులకు వెళ్తున్నారు.

ఇషా అంబానీ క్లాసులకు వెళ్తున్నది తన కోసం కాదు.. తన ఇద్దరు కవల పిల్లలు కృష్ణ, ఆదియా శక్తి కోసం. పిల్లల మెదడు సంపూర్ణ ఎదుగుదల ‍కోసం వారిని ప్రత్యేక తరగతులకు పంపుతున్నారు. పిల్లలతో తానూ ఓపిగ్గా ఆ తరగతులకు హాజరుతున్నారు. ఈ విషయాన్ని క్లాసులు నిర్వహించే టాకిల్‌ రైట్‌ అనే సంస్థ వ్యవస్థాపకురాలు వెల్లడించారు.

ईशा अंबानी ने मनाया ट्विंस का दूसरा जन्मदिन, बच्चों संग नाना मुकेश अंबानी  ने काटा केक - Ambani family celebrates isha ambani and anand piramal twins  aadiya krishna 2nd birthday tmovp

టికిల్ రైట్ ఫౌండర్‌ మునీరా సాహెబ్ దత్తానీ మాట్లాడుతూ ఇషా అంబానీ (Isha Ambani).. తన కవలలు ఆరు నెలల వయస్సు నుండి తమ తరగతులకు హాజరవుతున్నారని వెల్లడించారు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించి ఇషా చూపుతున్న చొరవను ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా తరగతుల గురించి ఆమె అనుభవాన్ని ఇషా అంబానీ వివరించారు. తనతోపాటు పిల్లలు ఆదియా, కృష్ణ క్లాస్‌లను ఆస్వాదిస్తారని చెప్పారు.

ఇదీ చదవండి: జియో పేమెంట్స్ బ్యాంక్ వినూత్న అకౌంట్‌

ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌ వ్యాపారాలకు, ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న ఇషా అంబానీ, 2018 డిసెంబరులో ఆనంద్ పిరమల్‌ను వివాహమాడారు. ఈ జంట 2022 నవంబర్ 19న కవలలకు జన్మనిచ్చారు. వీరికి ఆదియా శక్తి, కృష్ణ అని పేర్లు పెట్టారు. వీరికి ఐవీఎఫ్ ద్వారా ఈ పిల్లలు కలిగారు. ఈ విషయాన్ని ఎటువంటి సంకోచం లేకుండా ఇషా అంబానీ చెబుతుంటారు.

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)