Breaking News

నిధులు సమీకరణకు ప్రభుత్వ సంస్థ రెడీ

Published on Fri, 06/13/2025 - 08:51

అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్‌) ద్వారా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి పీఎస్‌యూ.. ఇరెడా రూ. 2,000 కోట్లు సమీకరించింది. ఈ నెల 5–10 మధ్య చేపట్టిన క్విప్‌నకు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించినట్లు కంపెనీ పేర్కొంది. బీమా రంగ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్‌) ఆసక్తి చూపినట్లు వెల్లడించింది. 

ఇష్యూ ప్రాథమిక పరిమాణం రూ. 1,500 కోట్లుకాగా.. 1.3 రెట్లు అధికంగా రూ. 2,006 కోట్ల విలువైన బిడ్స్‌ దాఖలైనట్లు తెలియజేసింది. అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్ల కేటాయింపును చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 165.14 ధరలో 12.15 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ. 10 ముఖ విలువగల వీటిని రూ. 155.14 ప్రీమియంతో కేటాయిస్తున్నట్లు వివరించింది. ఫ్లోర్‌ ధర రూ. 173.83తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్‌లో రూ. 165.14 చొప్పున షేర్లను జారీ చేస్తున్నట్లు తెలియజేసింది. 

ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ క్లెయిమ్‌లకు వేగంగా ఆమోదం

క్విప్‌ నిధుల సమీకరణతో కంపెనీ టైర్‌–1 మూలధనంసహా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) మరింత పటిష్టమైనట్లు పేర్కొంది. దేశీయంగా పునరుత్పాదక ఇంధన రంగ విస్తరణకు నిధులు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. 2023 నవంబర్‌లో ఐపీవో చేపట్టిన కంపెనీ తక్కువ సమయంలోనే క్విప్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇరెడా చైర్మన్, ఎండీ ప్రదీప్‌ కుమార్‌ పేర్కొన్నారు.
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)