Breaking News

బీమా సుగమ్‌.. వీలైనంత త్వరలో

Published on Sat, 06/17/2023 - 05:11

ముంబై: బీమా సుగమ్‌ పేరుతో ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ ప్లేస్‌ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఆగస్ట్‌ నాటికి ఇది వస్తుందనుకోగా, అంతకంటే ఎక్కువ సమయం తీసుకోనుందని తాజా సమాచారం. దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో బీమా రంగ అభివృద్ధి నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఉంది. బీమా సుగంతో దేశంలో బీమా సేవల విస్తరణ పెరుగుతుందని, క్లెయిమ్‌ల ప్రక్రియ మరింత సులభంగా మారుతుందని భావిస్తున్నారు. బీమా సుగమ్‌ ప్రారంభమైతే బీమా కంపెనీలు దీని ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు.

ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వినియోగదారులు పాలసీల కొనుగోలు, క్లెయిమ్‌లు సహా అన్ని రకాల సేవలను ఒకే వేదికగా పొందొచ్చు. శుక్రవారం ముంబైలో ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏబీఏఐ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ దేవాశిష్‌ పాండా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీమా సుగం ఎంతో క్లిష్టమైన ప్రాజెక్ట్‌ అని, కస్టమర్‌కు అన్ని రకాల ఎంపికలను ఒకే వేదికంగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఎలాంటి సమస్యల్లేని విధంగా ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. హెల్త్‌ క్లెయిమ్స్‌ ఎక్సే్ఛంజ్‌ ఏర్పాటుపైనా ఐఆర్‌డీఏఐ దృష్టి పెట్టింది. దీన్ని వేగంగా తీసుకొచ్చేందుకు సాధారణ బీమా సంస్థల సీఈవోలతో మాట్లాడినట్టు పాండా తెలిపారు.  

సమయం ఆదా
బీమా సుగమ్‌తో సమయం ఆదా అవుతుందని పాండా చెప్పారు. బీమా సంస్థలకు క్లెయిమ్‌ల ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. పాలసీదారులు, ఆస్పత్రులు ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్‌ పురోగతిని ట్రాక్‌ చేసుకోవచ్చని చెప్పారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)