Breaking News

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త!

Published on Wed, 10/18/2023 - 21:07

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం ఐఆర్‌సీటీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణంలో ప్యాసింజర్లు కోరుకున్న ఆహారాన్ని అందించేలా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో’తో జత కట్టింది. దీంతో ప్రయాణికులు రైల్వే ప్రయాణంలో కావాల్సిన ఫుడ్‌ ఐటమ్స్‌ను ముందే బుక్‌ చేసుకుంటే నిర్ధేశించిన రైల్వే స్టేషన్‌లో ఆహారాన్ని అందించనుంది.

ప్రస్తుతం, ఈ సౌకర్యం ఐదు స్టేషన్లకే పరిమితం చేసింది. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కింద ప్రస్తుతం ఢిల్లీతోపాటు ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో జొమాటో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక సర్వీసులు, ఆఫర్లను అందిస్తుంది. ప్రత్యేకించి నవరాత్రోత్సవాల్లో ఉపవాసం ఉండే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘థాలీ’ని అందిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.  

ఐఆర్‌సీటీసీతో ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో జొమాటో షేర్ రూ.115 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. అయితే మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి జొమాటో షేర్ రూ.113.20 వద్ద ముగిసింది. ఐఆర్‌సీటీసీ స్టాక్ రెండు శాతం నష్టాలతో రూ.700 వద్ద ట్రేడయి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.48 శాతం నష్టంతో రూ.704 వద్ద స్థిర పడింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)