IRCTC వెబ్‌సైట్‌ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు

Published on Wed, 07/15/2026 - 15:07

దేశంలో కోట్లాది మంది రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ నేడు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. గత వెబ్‌సైట్‌లో ఎదుర్కొన్న సాంకేతిక ఇబ్బందులు, తత్కాల్ సమయంలో సర్వర్ నిలిచిపోవడం వంటి సమస్యలకు చెక్‌ పెడుతూ అత్యాధునిక సాంకేతికతతో, క్లీన్ డిజైన్‌తో ఈ ప్లాట్‌ఫారమ్‌ను తీర్చిదిద్దారు.

సామర్థ్యంలో రికార్డు స్థాయి వృద్ధి

ఈ నూతన పోర్టల్ ప్రధాన బలం దాని బుకింగ్, ప్రాసెసింగ్ సామర్థ్యం. పాత వెబ్‌సైట్‌లో నిమిషానికి కేవలం 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుండగా ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్‌ఎస్‌) ద్వారా నిమిషానికి ఏకంగా 1.5 లక్షలకు పైగా టికెట్లను ఎలాంటి అంతరాయం లేకుండా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పీఎన్ఆర్ స్టేటస్, రైళ్ల వివరాల ఎంక్వైరీ సామర్థ్యం నిమిషానికి 4 లక్షల నుంచి రికార్డు స్థాయిలో 40 లక్షలకు పెరిగింది. ఇది తత్కాల్ బుకింగ్ సమయంలో సర్వర్ క్రాష్ అయ్యే అవకాశాలను పూర్తిగా నివారిస్తుంది.

ప్రయాణికులను ఆకట్టుకునే ఫీచర్లు

  • సాధారణ సమయాల్లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు చికాకు కలిగించే క్యాప్చా వెరిఫికేషన్‌ను తొలగించారు. దీనివల్ల తత్కాల్ బుకింగ్ కూడా మరింత వేగంగా ముగుస్తుంది.

  • విమాన ప్రయాణాల తరహాలోనే వివిధ తేదీల్లో ఉండే టికెట్ ధరలను సులభంగా పోల్చి చూసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక క్యాలెండర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

  • ప్రయాణికులు అన్ని తరగతుల సీట్ల లభ్యతను వేర్వేరుగా కాకుండా ఒకే స్క్రీన్‌పై చూసి నిర్ణయం తీసుకోవచ్చు.

  • కింగ్ సమయంలోనే ప్రయాణికులు తమకు నచ్చిన సీటు లేదా బెర్త్‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు.

దివ్యాంగులు, విద్యార్థులకు ఒకే వేదిక

దివ్యాంగులు, విద్యార్థులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించే రోగులకు అందించే ప్రత్యేక రాయితీలు, సేవలను వేర్వేరు పోర్టల్స్ ద్వారా కాకుండా ఈ సరికొత్త వెబ్‌సైట్‌లో ఒకే ప్లాట్‌ఫారమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. దేశంలోని అందరు ప్యాసింజర్లకు ఉపయోగపడేలా ఈ పోర్టల్‌ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఐఆర్‌సీటీసీ-ఐపే, యూపీఐ సాంకేతికతను మరింత పటిష్టం చేశారు.

ఇదీ చదవండి: మళ్లీ సీన్‌ రివర్స్‌.. ధరల దడ

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)