Breaking News

ఇరాన్‌ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!

Published on Mon, 05/20/2024 - 16:35

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఆల్-టైమ్ హైని తాకింది.  ముడి చమురు ధరలు పెరిగిపోయాయి.

బంగారం ధరలపై ప్రభావం
ఇరాన్ అధ్యక్షుడి మరణ వార్తల తర్వాత సోమవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. 0811 జీఎంటీ అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్‌ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది. 

అంతకుముందు సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్‌ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి  2,442.60 డాలర్లకు  చేరుకుంది. వెండి కూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.

ముడి చమురు ధరలు
ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ క్రాష్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రధాన చమరు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అనిశ్చితి మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం లాభాలను పొడిగించాయి. ఆరోగ్యంతో సమస్యల కారణంగా సౌదీ అరేబియా యువరాజు జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా తెలుస్తోంది.

భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 84.43 డాలర్లకి పెరిగింది. మే 10వ తేదీ తర్వాత ఇదే అత్యధికం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)