Breaking News

ఇజ్రాయెల్‌-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దు

Published on Wed, 10/02/2024 - 17:34

ఇజ్రాయెల్‌-ఇరాన్ దాడి కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ ఎయిర్‌లైన్స్ చర్యలు చేపట్టాయి. ఈమేరకు పలు విమాన సర్వీసుల సమయంలో మార్పలు, మరికొన్నింటిని రద్దు చేస్తు​న్నట్లు ప్రకటించాయి. ఎతిహాద్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్, ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్‌వేస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఈమేరకు ప్రకటన విడుదల చేశాయి.

మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో గగనతల పరిమితుల కారణంగా బుధవారం విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్‌వేస్ తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ అక్టోబర్ 2, 3 తేదీల్లో ఇరాక్ (బాస్రా, బాగ్దాద్), ఇరాన్, జోర్డాన్‌లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇరాక్, ఇరాన్‌లకు ప్రయాణించే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్‌లకు అక్టోబర్ 2, 3 తేదీలకు ప్రయాణాలు సాగించే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిలిపేస్తున్నట్లు ఫ్లైదుబాయ్‌ పేర్కొంది. కువైట్ ఎయిర్‌వేస్ విమాన సమయాల్లోనూ మార్పులు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పెట్రోల్‌ అప్‌.. డీజిల్‌ డౌన్‌!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌  మంగళవారం సుమారు 400 బాలిస్టిక్‌  మిసైల్స్‌తో భీకరంగా దాడులు చేసింది. అయితే  వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ తమ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థతో ఇరాన్‌ మిసైల్స్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించింది.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు