Breaking News

బడా ఐపీఓల బొనాంజా!

Published on Tue, 06/18/2024 - 04:18

ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా పబ్లిక్‌ ఇష్యూల హవా కొనసాగనుంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకతేమిటంటే దిగ్గజ కంపెనీలు భారీస్థాయిలో నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో ఆటో దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సహా.. స్విగ్గీ, బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ఆఫ్కన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితరాలు చేరాయి. రూ.60,000 కోట్లకు పైగా నిధులను సమీకరించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి.

ముంబై: కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు మళ్లీ దూకుడు చూపుతున్నాయి. రోజుకో కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 77,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23,500కు చేరాయి. ఈ నేపథ్యంలో పలు అన్‌లిస్టెడ్‌ దిగ్గజాలు పబ్లిక్‌ ఇష్యూలవైపు దృష్టి పెట్టాయి. స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ తలుపుతడుతున్నాయి. తద్వారా భారీస్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. 

వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్‌ సరికొత్త రికార్డుకు వేదికకానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2023–24) పలు చిన్న, మధ్యతరహా కంపెనీలు ఆసక్తి చూపడంతో సగటున ఐపీవో ఇష్యూ పరిమాణం రూ. 815 కోట్లుగా నమోదైంది. ఇక 2022–23లో ఒక్కో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,409 కోట్లుకాగా.. 2021–22లో రూ. 2,105 కోట్లు. అయితే ఈ ఏడాది వీటికి మించి అంటే రెట్టింపు అంతకంటే ఎక్కువ సగటు పరిమాణం నమోదుకానున్నట్లు స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

లిస్టింగ్‌వైపు చూపు... 
రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిబంధనలకు అనుగుణంగా బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిస్టింగ్‌ బాటలో సాగుతోంది. సెబీ అనుమతితో రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఆఫ్కన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సైతం ఐపీవో ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ  రూ. 8,000 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఈ బాటలో ఈవీ స్కూటర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ రూ. 5,500 కోట్లు, ఎన్‌ఎస్‌డీఎల్‌ రూ. 4,500 కోట్లు, వరీ ఎనర్జీస్‌ రూ. 3,000 కోట్ల, ఎమ్‌క్యూర్‌ రూ. 2,300 కోట్ల చొప్పున సమీకరించనున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోల ద్వారా  మొత్తం రూ. 14,600 కోట్లు అందుకున్నాయి.

ఎల్‌ఐసీ రికార్డుకు చెక్‌!
దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్‌ దేశీ విభాగం ఐపీవో అనుమతి కోసం సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా 15–20 శాతం వాటా విక్రయించే వ్యూహంలో ఉంది. దీంతో 3.3–5.6 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 25,000 కోట్లు) అందుకునే వీలున్నట్లు అంచనా. ఫలితంగా 2022–23లో రూ. 21,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఇష్యూని అధిగమించనుంది. దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)