Breaking News

ఐఫోన్ 18 ప్రో మాక్స్‌.. లాంచ్ ఎప్పుడంటే?

Published on Tue, 10/14/2025 - 20:25

గత నెలలో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. కాగా ఇప్పుడు టెక్ దిగ్గజం ఐఫోన్ 18 ప్రో మాక్స్‌పై దృష్టి సారించింది. అయితే ఈ కొత్త ఫోనుకు సంబంధించిన డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కొన్ని లీక్ అయ్యాయి. యాపిల్ కంపెనీ తన తదుపరి ఐఫోన్‌లో ఏమి అందిస్తుందని ఇక్కడ తెలుసుకుందాం.

ఐఫోన్ 18 ప్రో మాక్స్.. ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో మోడళ్లతో పోలిస్తే కొంచెం చిన్న డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉండనుంది. రియర్ డిజైన్ కొంత అప్డేట్ పొందుతుంది.. కానీ కెమెరా ప్లేస్‌మెంట్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే ఉంటుంది. మెరుగైన థర్మల్ నిర్వహణకు సహాయపడటానికి ఆపిల్ కొత్త స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపయోగించనుంది. డిస్ప్లే పరిమాణాల విషయానికొస్తే.. ఐఫోన్ 18 ప్రో 6.3 ఇంచెస్, ఐఫోన్ 18 ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ పొందనున్నట్లు సమాచారం.

కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 18 ప్రో మాక్స్ 48-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌కు.. వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. రీడిజైన్ కెమెరా కంట్రోల్ బటన్‌ రానుంది. వేగవంతమైన పనితీరు, మెరుగైన శక్తి సామర్థ్యం కోసం ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

సాధారణంగా ఎప్పుడూ యాపిల్ కంపెనీ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలోనే కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది. కాబట్టి ఐఫోన్ 18 సిరీస్ కూడా అప్పుడే (2026 సెప్టెంబర్) లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర.. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటుందని అంచనా.

ఇదీ చదవండి: తక్కువ ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్

Videos

తులం కొనాలంటే.. పొలం అమ్మాల్సిందే..

తిరుపతిలో YSRCP శ్రేణుల ధర్నా

తురకపాలెంలో ప్రజలు ఎందుకు చనిపోతున్నారో కనిపెట్టలేవా?

భరణి దివ్య రిలేషన్.. అన్నయ్య అంటుంది కానీ.. నాకు డౌటే

Abhinay: ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదు

మద్యం అక్రమ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం

Malladi Vishnu: పేరుకే అనుభవం అభివృద్ధిలో శూన్యం

బాబుపై చురకలు.. జగన్ పై పరోక్ష ప్రశంసలు

గజదొంగ చంద్రబాబు కరణం ధర్మశ్రీ నాన్ స్టాప్ సెటైర్లు

పిచ్చి పరాకాష్టకు అంటే ఇదే.. ప్రధాని మోదీ సభకు కమర్షియల్ టార్గెట్స్

Photos

+5

తెలంగాణలో గుప్త ఆలయం! సాహసోపేతమైన ప్రయాణం.. కోపాన్ని తగ్గించే కోనేరు.. మీకు తెలుసా? (ఫొటోలు)

+5

దీపావళి ఈవెంట్‌లో సెలబ్రిటీలు.. ఇండస్ట్రీ అంతా ఒకేచోట (ఫొటోలు)

+5

దత్తత కూతురి బర్త్ డే సెలబ్రేషన్‌లో సన్నీ లియోన్ (ఫొటోలు)

+5

‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ శారీ లుక్‌లో ‘కూలి​’ బ్యూటీ..

+5

సారా టెండుల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో 'కాంతార' బ్యూటీ (ఫొటోలు)

+5

కాంతార ‘కనకావతి’ శారీ లుక్‌ అదరహో! (ఫొటోలు)

+5

'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)

+5

చాలారోజుల తర్వాత 'విష్ణు ప్రియ' గ్లామ్‌ షూట్‌ (ఫోటోలు)