Breaking News

ఇప్పుడు ఇల్లు.. ఇలా కొనడమే ఇష్టం

Published on Sat, 06/21/2025 - 20:04

గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపిన కస్టమర్లు.. ప్రస్తుతం లాంచింగ్‌ ప్రాజెక్ట్‌లలో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2023లో రెడీ టూ మూవ్, లాంచింగ్‌ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్ల నిష్పత్తి 46:18 శాతంగా ఉండగా.. 2024 నాటికి 23:24 శాతానికి చేరింది. అలాగే రూ.కోటిన్నర ధర ఉన్న లగ్జరీ గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 2023లో 20 శాతం మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 2024 నాటికి 35 శాతానికి పెరిగిందని ఫిక్కీ, అనరాక్‌ సర్వేలో వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో

బాల్కనీ మస్ట్‌.. 
1, 2, 3 బీహెచ్‌కే.. ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే. గృహ కొనుగోలుదారులు నిర్మాణం నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు.. ప్రస్తుతం ఎక్కువ ఓపెన్‌ స్పేస్‌ ఉండాలని కోరుకుంటున్నారు. 75 శాతం మంది బాల్కనీ ఉండే ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించగా, 74 శాతం మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. అనరాక్‌ రీసెర్చ్‌ దేశంలోని పలు నగరాలలో 5,510 మందిపై ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహించింది.

 

గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారుల విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50 శాతం మంది కస్టమర్లు 3 బీహెచ్‌కే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే.. 38 శాతం మంది 2 బీహెచ్‌కే గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్‌సీఆర్‌ నగరాలలో 3 బీహెచ్‌కే యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44 శాతం మంది కస్టమర్లు 2 బీహెచ్‌కేలకు, 17 శాతం 1 బీహెచ్‌కేలకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణేలో 10 శాతం కొనుగోలుదారులు 1 బీహెచ్‌కే జై కొడుతున్నారు.

పెట్టుబడులకు రియలే బెటర్‌.. 
ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఫ్లాట్ల విస్తీర్ణాలు 11 శాతం మేర పెరుగుతున్నాయి. 2022లో 1,175 చ.అ.లుగా ఉన్న సగటు ఫ్లాట్ల సైజు.. 2023 నాటికి 1,300 చ.అ.లకు పెరిగాయి. 58 శాతం మిలీనియల్స్, 39 శాతం జెన్స్‌–ఎక్స్‌ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57 శాతం మంది రియల్‌ ఎస్టేట్‌ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36 శాతం మంది నివాస విభాగంలో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్పారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)