Breaking News

రియల్టీ కంపెనీలలో వాటా విక్రయం.. 2 కోట్ల షేర్లు అమ్మేసిన ఇన్వెస్కో

Published on Thu, 07/24/2025 - 16:57

దేశీ రియల్టీ రంగ కంపెనీలు ఒబెరాయ్‌ రియల్టీ, లోధా డెవలపర్స్‌లో యూఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఇన్వెస్కో తాజాగా 2 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఒబెరాయ్‌ రియల్టీలో 2.95 శాతం వాటాకు సమానమైన కోటికిపైగా షేర్లను అమ్మివేసింది.

బీఎస్‌ఈ బల్క్‌డీల్‌ వివరాల ప్రకారం అనుబంధ సంస్థ ఇన్వెస్కో డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ షేరుకి రూ. 1,754.26 ధరలో వీటిని విక్రయించింది. తద్వారా రూ. 1,883 కోట్లకు అందుకుంది. 2025 జూన్‌కల్లా ఇన్వెస్కో ఫండ్‌కు ఒబెరాయ్‌ రియల్టీలో 3.01 శాతం వాటా ఉంది. కాగా.. ఈ బాటలో లోధా డెవలపర్స్‌లోనూ 1 శాతం వాటాకు సమానమైన 95.25 లక్షల షేర్లను విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్‌ ప్రకారం షేరుకి రూ. 1384.93 ధరలో అమ్మివేయడం ద్వారా రూ. 1,319 కోట్లకుపైగా సమకూర్చుకుంది.  

ఎస్‌బీఐ ఫండ్‌ కొనుగోలు 
ఒబెరాయ్‌ రియల్టీలో 1.13% వాటాకు సమానమైన 40.94 లక్షల షేర్లను ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సొంతం చేసుకుంది. షేరుకి రూ. 1,754.10 సగటు ధరలో రూ. 718.2 కోట్లకు కొనుగోలు చేసింది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఇదేవిధంగా ఎన్‌ఎస్‌ ఈ గణాంకాల ప్రకారం లోధా డెవలపర్స్‌ షేర్ల కొనుగోలుదారుల వివరాలు సైతం వెల్లడికాలేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)