Breaking News

ఇల్లు అద్దెకివ్వడానికి ఇంటర్వ్యూ.. దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో చుక్కలు చూపించిన ఓనర్‌! 

Published on Thu, 07/13/2023 - 21:48

అద్దె ఇంటి కోసం మీరెప్పుడైనా ఇంటర్వ్యూ ఎదుర్కొన్నారా? అద్దె ఇంటికి ఇంటర్వ్యూ ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరులో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ ఎంట్రప్రిన్యూర్‌కు ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. వింత వింత ప్రశ్నలతో బెదరగొట్టేశాడు ఆ ఇంటి ఓనర్‌. 

బెంగళూరులో ఓ స్టార్టప్‌ నిర్వహిస్తున్న నీరజ్‌ మెంట అనే ఎంట్రప్రిన్యూర్‌ అద్దె ఇంటి వేటలో తనకు ఎదురైన వింత అనుభవాన్ని, ఇంటి ఓనర్‌తో జరిగిన ఇంటర్వ్యూ ప్రక్రియను, ఆయన అడిగిన వింత ప్రశ్నలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. తాను నిధుల కోసం కూడా ఇంత కఠోరమైన ఇంటర్వ్యూను ఎదుర్కోలేదు అంటూ ఇంటి ఓనర్‌ ప్రశ్నల తీరును వివరించారు. 

ఇంటి కోసం మొదట బ్రోకర్‌ ద్వారా కొంత సమాచారం, లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్స్‌ను పంపించాక ఆ బ్రోకర్‌ ఇంటి ఓనర్‌తో కాల్‌ ఏర్పాటు చేశాడు. ఇక ఆ ఇంటి ఓనర్‌ ఇంటర్వ్యూ ప్రారంభించాడు. కుటుంబ నేపథ్యం నుంచి మొదలు పెట్టి మెల్లిగా స్టార్టప్‌ గురించి ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు. బిజినెస్‌ మోడల్‌ ఏంటీ, బర్న్‌ రేట్‌, ఇన్వెస్టర్లు.. ఇలా సంబంధం లేని ప్రశ్నలన్నీ అడిగాడు. తర్వాత నీరజ్‌ భార్య లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ గురించి కూడా వివరాలు ఆరా తీశాడు. 

ఇలా చాలా సేపు ప్రశ్నలు అడిగిన ఆయన తన ఇంట్లో అద్దెకు ఉండేవారు మంచి వంశ వృక్షం ఉన్నవారై ఉండాలని సెలవిచ్చారు. ఇంకా కొంతమందితో మాట్లాడి ఒకటి రెండు రోజులలో ఏ విషయం చెబుతానన్నాడు. ఇదంతా విన్న నీరజ్‌ భార్య ‘నువ్వు నిధుల సమీకరణ కోసం వెళ్లావా?’ అని చమత్కరించిందని చెప్పుకొచ్చాడు. ట్విటర్‌లో ఇదంతా చదివిన పలువురు యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు.

ఇదీ చదవండి: బెంగళూరులో బతకాలంటే ఎంత జీతం కావాలి? ట్విటర్‌లో ఆసక్తికర చర్చ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)