Breaking News

ఆపిల్ కొత్త ప్రొడ‌క్ట్‌.. నోరెళ్ల‌బెడుతున్న జ‌నం!

Published on Thu, 11/13/2025 - 18:33

ఆపిల్ ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వ‌చ్చిందంటే చాలు ఆపిల్ స్టోర్ల ముందు జ‌నాలు క్యూ క‌డుతుంటారు. ఐఫోన్ల‌తో పాటు ఆపిల్ స్మార్ట్ వాచీలు, ఇయ‌ర్ బ‌డ్స్ లాంటి వాటికి కూడా వినియోగ‌దారుల్లో క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఆపిల్ సంస్థ విడుద‌ల చేసిన యాక్సెసరీపై మాత్రం మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దాని ధ‌ర చూసి నోరెళ్లబెడుతున్నారు.

ఐఫోన్ పాకెట్ (iPhone Pocket) అనే కొత్త, హై-ఫ్యాషన్ క్లాత్‌ యాక్సెసరీని ఆపిల్ సంస్థ మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది. జపనీస్ ఫ్యాషన్ డిజైనర్ ఇస్సే మియాకే దీన్ని రూపొందించారు. చూడ‌టానికి షూ సాక్స్ మాదిరిగా ఉన్న ఉంది ఈ పాకెట్. ఐఫోన్, ఇత‌ర ప‌రిక‌రాలను ఇందులో వేసుకుని త‌గిలించుకునేలా దీన్ని త‌యారు చేశారు. ఫోన్‌తో పాటు ఇత‌ర వ‌స్తువుల‌ను సులువులుగా క్యారీ చేసేందుకు దీన్ని రూపొందించిన‌ట్టు టెక్ దిగ్గజం వెల్ల‌డించింది. దీని ధ‌ర రూ. 20,379 ($229.95) గా నిర్ణ‌యించింది.

నెటిజ‌నుల సెటైర్లు 
ఐఫోన్ పాకెట్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు సెటైర్లు పేల‌స్తున్నారు. ఇంత ధ‌ర పెట్టి ఈ గుడ్డ సంచిని ఎవ‌రు కొంటార‌ని కామెంట్స్ చేస్తున్నారు. ''టెక్ దిగ్గ‌జ కంపెనీలు AI మోడళ్లను త‌యారు చేస్తుంటే, ఆపిల్ సాక్స్‌తో ఆడుకుంటోంది. @Appleలో ఏమి జరుగుతోంది?'' అని ఓ నెటిజ‌న్ వాపోయాడు. ఐఫోన్ పాకెట్‌ను చూస్తే.. పేర‌డీలా ఉంద‌ని మ‌రొక‌రు అన్నారు.

తాము ఎలాంటి ఉత్ప‌త్తులు మార్కెట్‌లోకి విడుద‌ల చేసినా అభిమానులు కొంటార‌నే అభిప్రాయంతో ఆపిల్ ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోందని ఇంకో నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. ఐఫోన్ పాకెట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంద‌నే అభిప్రాయాన్ని ఒక నెటిజ‌న్ వ్య‌క్త ప‌రిచారు. ఆఫీసుల‌కు వెళ్లే ధ‌నిక ఆసియా మ‌హిళ‌లు ఇస్సీ మియాకే డిజైన్లు న‌చ్చుతాయ‌ని పేర్కొన్నారు.

చ‌ద‌వండి: వేదిక‌పైనే కుప్ప‌కూలిన రోబో

అయితే ఆపిల్ తన పరికరాల కోసం పౌచ్ లాంటి ఉత్పత్తిని రూపొందించడం ఇదే మొదటిసారి కాదు. 2004లో స్టీవ్ జాబ్స్ (Steve Jobs) 29 డాల‌ర్లకే ఐపాడ్ సాక్స్‌ను ప్రవేశపెట్టారు.

  

#

Tags : 1

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు