Breaking News

పెరిగే కార్ల అమ్మకాలతో ఆయిల్‌కు డిమాండ్‌

Published on Sat, 06/15/2024 - 06:26

న్యూఢిల్లీ: చమురు దిగుమతులు, వినియోగంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆయిల్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఒక నివేదికలో పేర్కొంది.  ఐఈఏ నివేదిక  ప్రకారం, 2024లోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్‌ నిలుస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. 

దేశీయంగా వినియోగ మార్కెట్‌ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తయారీ, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. రహదారి రవాణాకు భారత్‌లో డీజిల్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. 2023–2030 మధ్య కాలంలో ఆయిల్‌ వినియోగ వృద్ధిలో రహదారి రవాణా విభాగం వాటా 5,20,000 బీపీడీగా (మొత్తం వినియోగంలో 38 శాతం) ఉండగలదు. 

అలాగే కార్ల కొనుగోళ్లు పెరిగే కొద్దీ పెట్రోల్‌ వినియోగం 2,70,000 బీపీడీ మేర (మొత్తంలో 20 శాతం) వృద్ధి చెందవచ్చు. మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ డిమాండ్‌ అత్యధికం. 2000తో పోలిస్తే 2023లో భారత్‌లో కార్ల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగింది. దేశీయంగా కార్ల సంఖ్య 2030 నాటికి 40 శాతం మేర పెరగొచ్చు. ఇక మొత్తం వాహనాల సంఖ్యలో మూడొంతుల వాటా ఉండే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కూడా కీలకంగా ఉండగలదు. 

నివేదికలో మరిన్ని అంశాలు.. 
⇢ పెట్రోకెమికల్స్‌ ఉత్పత్తిలో ఎల్‌పీజీ, ఈథేన్‌ వినియోగం 40,000 బీపీడీ స్థాయిలో పెరగొచ్చు. 
⇢ 2023లో 58 లక్షల బీపీడీగా ఉన్న భారత్‌ రిఫైనింగ్‌ సామర్థ్యం 2030 నాటికి 68 లక్షల బీపీడీకి చేరవచ్చు.  
⇢ భారత్‌ దిగుమతి అవసరాలు దాదాపు 10 లక్షల బీపీడీ స్థాయిలో 46 లక్షల బీపీడీ నుంచి 56 లక్షల బీపీడీకి చేరవచ్చు. రిఫైనరీలను వేగవంతంగా విస్తరిస్తుండటంతో క్రూడ్‌ ప్రాసెసింగ్‌ సామర్థ్యాలు 10 లక్షల బీపీడీ స్థాయిలో పెరగవచ్చు.  
⇢ ఈ దశాబ్దం ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్‌కు భారత్‌ చోదకంగా ఉండగలదు. 
⇢ 2023–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురు వినియోగం చైనాను మినహాయించి మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా ఉంటుంది. ఇది ఏకంగా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) మేర పెరిగే అవకాశం ఉంది. 
⇢ 2023లో రోజుకు 54 లక్షల బ్యారెళ్లుగా (బీపీడీ) ఉన్న చమురు డిమాండ్‌ 2030 నాటికి 3.2 శాతం పెరిగి (రోజుకు 13 లక్షల బ్యారెళ్లు) 67 లక్షల బీపీడీకి చేరగలదని అంచనా. 
⇢ 2025–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురుకు డిమాండ్‌ 9,00,000 బీపీడీ మేర పెరగనుండగా, చైనాలో ఇది 5,70,000 బీపీడీగా ఉండనుంది. అంతర్జాతీయంగా చూస్తే 2029 నాటికి ఆయిల్‌ డిమాండ్‌ తారస్థాయికి చేరుకోగలదు. అయితే అటు తర్వాత తగ్గే అవకాశం ఉంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)