Breaking News

నదుల అనుసంధానం.. భారీగా వ్యాపారావకాశాలు: ఐసీఆర్ఏ

Published on Mon, 09/23/2024 - 20:08

గత కొన్నేళ్లుగా వాటర్ సెక్టార్ మీద కేంద్ర ప్రభుత్వ దృష్టి బాగా పెరిగింది. ఇందులో భాగంగానే నదుల అనుసంధానాలను వేగవంతం చేసింది. నదుల ప్రాజెక్టులను అనుసంధానం చేయడం వల్ల రూ. కోట్ల వ్యాపార అవకాశాలు లభిస్తాయని 'ఐసీఆర్ఏ' నివేదికలో పేర్కొంది. వచ్చే దశాబ్దంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ (EPC) సంస్థలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు లభించవచ్చని అంచనా.

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) 16 ద్వీపకల్ప నదులను, 14 హిమాలయ నదుల అనుసంధానాలతో కూడిన మొత్తం 30 ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులను అనుసంధానించనుంది. కేంద్రం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ జల్ జీవన్ మిషన్‌కు భారీ నిధులను కేటాయించింది.

ప్రణాళికలో నాలుగు ప్రధాన లింక్‌లు ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు అనుసంధానానికి అనుమతులు లభిస్తాయని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్టార్ హెడ్ చింతన్ లఖానీ పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుల ప్రస్తుత వాటా తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు.  

ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..

కెన్ - బెత్వా, కోసి - మెచి, పర్బతి - కలిసింద్ - చంబల్, గోదావరి - కావేరి మాత్రమే ప్రణాళికలో ఉన్న నాలుగు ప్రధాన లింక్‌లు. 2034 - 35 నాటికి మొత్తం రూ. 2.6 లక్షల కోట్లతో ఈ ప్రాధాన్యతా లింక్‌లు పూర్తవుతాయని ఐసీఆర్ఏ వెల్లడించింది. ఇందులో గోదావరి - కావేరి అనుసంధానం చాలా పెద్దది. కోసి - మెచి చాలా చిన్నది. ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు పెరుగుతాయి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)