Breaking News

డిజిన్వెస్ట్‌మెంట్‌ టార్గెట్‌... రూ. 50,000 కోట్లు

Published on Fri, 02/02/2024 - 05:05

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25) డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 50,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించారు. వెరసి ఈ ఏడాది (2023–24)కి రూ. 30,000 కోట్ల సవరించిన అంచనాలకంటే అధికంగా డిజిన్వెస్ట్‌మెంట్‌ టార్గెట్‌ను ప్రభుత్వం నిర్దేశించుకుంది. నిజానికి గతేడాది ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆరి్ధక శాఖ రూ. 51,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించింది.

అయితే ఆపై ప్రభుత్వం రూ. 30,000 కోట్లకు లక్ష్యాన్ని సవరించింది. కాగా.. 2024–25 ఏడాదికి   లోక్‌సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్‌ను ప్రతిపాదించకపోవడం గమనార్హం! తద్వారా నిధులను సమకూర్చుకునేందుకు ఎలాంటి ప్రణాళికలనూ ప్రకటించలేదు. గత బడ్జెట్‌ అంచనాలలో ఈ మార్గంలో రూ. 10,000 కోట్లను అందుకోవాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.  

ఇదీ తీరు..
డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 7 సీపీఎస్‌ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 12,504 కోట్లను సమకూర్చుకుంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ దిగ్గజాలు కోల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్‌వీఎన్‌ఎల్, ఇరెడా తదితరాలున్నాయి. మార్చికల్లా వాటాల ఉపసంహరణ(డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా మొత్తం రూ. 30,000 కోట్లను అందుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. 2018–19, 2017–18ని మినహాయిస్తే.. ప్రతి బడ్జెట్‌లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను చేరుకోకపోవడం గమనార్హం! 2017–18కి బడ్జెట్‌ అంచనాలు రూ. లక్ష కోట్లు కాగా.. అంతకుమించి రూ.1,00,056 కోట్లను సమీకరించడం ద్వారా ప్రభుత్వం రికార్డు నెలకొలి్పంది. ఈ బాటలో 2018–19లోనూ బడ్జెట్‌ అంచనాలు రూ.80,000 కోట్లను అధిగమిస్తూ సీపీఎస్‌ఈల లో వాటాల విక్రయం ద్వారా రూ. 84,972 కోట్ల నిధులు అందుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)