Breaking News

ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!

Published on Sun, 06/11/2023 - 10:53

World Largest Truck: చాలా మంది ఇప్పటి వరకు నాలుగు, ఎనిమిది, పదహారు చక్రాల ట్రక్కులను చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్రక్కు వాటన్నింటికంటే.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కు కావడం గమనార్హం. 'బెలాజ్ 75710' (Belaz 75710) పేరు కలిగిన ఈ ట్రక్కు ఒకసారికి సుమారు 500 టన్నుల బరువును తీసుకెళుతుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కుగా ప్రసిద్ధి చెందిన ఈ వాహనం బెలారస్‌లో ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ట్రక్కులను తయారు చేసే BelAZ కంపెనీ సోవియట్ యూనియన్ కాలంలో బెలారస్, జోడినో నగరంలో ఉండేది. సోవియట్ యూనియన్ విచ్చిన్నమైన తరువాత ఈ కంపెనీ ఇతర దేశాల కంటే పెద్దగా ఉండే వాహనాలను తయారు చేయడం ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కూడా కైవసం చేసుకుంది.

(ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?)

ఇక బెలాజ్ 75710 విషయానికి వస్తే.. దీని బరువు 450 టన్నులు. దీనికి 8 చక్రాలు అమర్చారు, ఒక్కొక్క టైర్ బరువు సుమారు 5 టన్నుల కంటే ఎక్కువ. ట్రక్కు పొడవు 20 మీటర్లు, వెడల్పు 9.7 మీటర్లు. లోడ్ తీసుకెళ్లేటప్పుడు ఈ ట్రక్కు స్పీడ్ 45 కిమీ/గం కాగా, ఖాళీగా ఉన్నప్పుడు 60 కిమీ/గం వేగంతో వెళుతుంది. ఇంత పెద్ద భారీ ట్రక్కు పనిచేయాలంటే ఒక్క ఇంజిన్ సరిపోదు. కావున ఇందులో రెండు డీజిల్ ఇంజిన్లు అమర్చారు.

(ఇదీ చదవండి: 46 శాతం డిస్కౌంట్‌తో ప్రీమియం మొబైల్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే ఇలా చేయండి!)

బెలాజ్ 75710 ట్రక్కులోని 16 సిలిండర్ టర్బోచార్జ్‌‌డ్ డీజిల్ ఇంజిన్లు 2300 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రస్తుతం ఈ ట్రక్కుని సైబీరియాలోని బచట్‌స్కై ఓపెన్ పిట్ కోల్ మైన్‌లో ఫీల్డ్ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. కావున ఇది త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాహనాలు క్వారీలలో చాలా ఉపయోగపడతాయి. దీని ధర సుమారు రూ. 50 కోట్లకంటే ఎక్కువ వుండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు