Breaking News

మీకు తెలుసా! ఒక ట్రైన్ తయారీకి అయ్యే ఖర్చు ఎంతంటే?

Published on Sun, 06/11/2023 - 08:29

ట్రైన్ గురించి, ట్రైన్ జర్నీ గురించి దాదాపు అందరికి తెలుసు. రైలు ప్రయాణం అంటేనే అదో రకైమన అనుభూతి అనే చెప్పాలి. లయబద్దంగా కదులుతూ ఎన్నెన్నో కొత్త ప్రాంతాలను పరిచయం చేసే ఆ ప్రయాణం చేసిన వారికే తెలుస్తుంది. అయితే ఒక ట్రైన్ తయారవడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది. ఒక బోగీ తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అని చాలా మందికి తెలియక పోవచ్చు. మనం ఈ కథనంలో అలాంటి వివరాలను తెలుసుకుందాం.

కొన్ని నివేదికల ప్రకారం.. మన దేశంలో 12,000 కంటే ఎక్కువ ట్రైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ప్రతి రోజూ కొన్ని లక్షల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం వివిధ రకాల రైళ్లు ఉన్నాయి. ప్యాసింజర్ ట్రైన్లలో అయితే జనరల్, ఏసీ, స్లీపర్ అనే పేర్లతో బోగీలు ఉంటాయి.

నిపుణుల అంచనాల ప్రకారం, ఒక స్లీపర్ కోచ్ తయారు చేయడానికి సుమారు రూ. 1.25 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. జనరల్ బోగీ తయారు చేయడానికి రూ. కోటి, ఏసీ కోచ్ నిర్మించడానికి రెండు కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇక ఇంజిన్ తయారీ విషయానికి వస్తే.. ట్రైన్ మొత్తం ఈ ఇంజిన్ మీద ఆధార పడి ఉంటుంది, కావున దానికయ్యే ఖర్చు ఆ రేంజ్‍లోనే ఉంటుందని చెబుతున్నారు. ఇంజిన్ తయారీకి రూ. 20 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!)

ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి సుమారు రూ. 100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన వందే భారత్ రైలు తయారీకి రూ. 115 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నారు. ఈ ట్రైన్ బోగీలను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ట్రైన్ చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో సుమారు 24 బోగీలు నాశనమైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ కోచ్‌ల మొత్తం విలువ రూ. 48 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)