Breaking News

మామూలు బ్యాంక్‌ బ్యాలెన్స్‌పైనా ఎక్కువ వడ్డీ!

Published on Sun, 10/20/2024 - 17:24

నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్‌ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్‌ అకౌంట్‌పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్‌పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.

ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇదీ చదవండి: కార్మికశాఖ కీలక నిర్ణయం..  పీఎఫ్‌పై మరింత ప్రయోజనం

పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్‌ అకౌంట్‌ డిపాజిట్లపై అన్ని బ్యాంక్‌ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు  బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్  ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.

ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?
సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో  ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి  ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)