Breaking News

ఇన్సూర్‌టెక్‌ రంగానికి ఉజ్వల భవిష్యత్తు

Published on Sun, 11/24/2024 - 10:48

న్యూఢిల్లీ: భారత ఇన్సూర్‌టెక్‌ రంగానికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయని ఒక నివేదిక తెలిపింది. గడిచిన కొన్నేళ్లలో ఈ రంగం 2.5 బిలియన్‌ డాలర్లు సమీకరించగా.. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని అంచనా వేసింది. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ), ఇండియా ఇన్సూర్‌టెక్‌ అసోసియేషన్‌ (ఐఐఏ) ఈ నివేదికను రూపొందించాయి.

‘‘ప్రస్తుతం భారత్‌లో 150 ఇన్సూర్‌టెక్‌ కంపెనీలు (బీమా రంగ టెక్నాలజీ సంస్థలు) ఉన్నాయి. ఇందులో 10 యూనికార్న్‌లు, సూనికార్న్‌లు, 45కు పైగా మినీకార్న్‌లు ఉండగా, గడిచిన ఐదేళ్లలో ఆదాయం 12 రెట్లు పెరిగి 750 మిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తం మీద ఈ రంగంలోకి వచ్చిన నిధులు 2.5 బిలియన్‌ డాలర్లు. దీంతో మొత్తం ఎకోసిస్టమ్‌ విలువ 13.6 బిలియన్‌ డాలర్లను అధిగమించింది’’అని ఈ నివేదిక వివరించింది. డిమాండ్, పంపిణీపై ఇన్సూర్‌టెక్‌లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని, అండర్‌ రైటింగ్‌ (రిస్క్‌ల మదింపు), క్లెయిమ్‌లు, సేవల్లో ఆవిష్కరణలకు గణనీయమైన అవకాశాలున్నట్టు ఈ నివేదిక అభిప్రాయపడింది.  

అపార అవకాశాలు.. 
గడిచిన ఐదేళ్లలో భారత ఇన్సూర్‌టెక్‌ రంగం ఆదాయం 12 రెట్లు పెరిగినప్పటికీ.. భవిష్యత్తులో మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు బీసీజీ, ఐఐఏ నివేదిక వెల్లడించింది. ‘‘అండర్‌ రైటింగ్, క్లెయిమ్‌లలో డేటా, టెక్నాలజీ సామర్థ్యాల ను వినియోగించుకునేందుకు ఇన్సూర్‌టెక్‌ కంపెనీలకు అపార అవకాశాలున్నాయి’’ అని బీసీజీలో ఇండియా ఇన్సూరెన్స్‌ ప్రాక్టీస్‌ లీడ్, ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన పల్లవి మలాని తెలిపారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఇన్సూరెన్స్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఇన్సూరెన్స్‌ పరంగా చెప్పుకోతగ్గ పురోగతి సాధించినప్పటికీ.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విస్తరణ ఇప్పటికీ ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందన్నారు. 45 శాతం వైద్య చికిత్సల వ్యయాలను జేబుల నుంచే వ్యయం చేయాల్సి వస్తున్నట్టు వివరించారు. దీంతో 2047 నాటికి నూరు శాతం ప్రజలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని సాధించడంతోపాటు, జేబు నుంచి చేసే వ్యయాలను 10 శాతం లోపునకు పరిమితం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ నివేదిక సూచించింది. ఇక అంతర్జాతీయంగా ఇన్సూర్‌టెక్‌ రంగంలోకి నిధుల రాక తగ్గినట్టు, ఆసియా పసిఫిక్‌ ప్రాంతం ఈ విషయంలో బలంగా నిలబడినట్టు ఈ నివేదిక తెలిపింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)