Breaking News

జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధి

Published on Thu, 06/12/2025 - 08:55

జీవిత బీమా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో మెరుగైన వృద్ధిని చూశాయి. న్యూ బిజినెస్‌ ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల ద్వారా) 10.8 శాతం పెరిగింది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో న్యూ బిజినెస్‌ ప్రీమియం ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.30,463 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది మే నెలలో ఇది రూ.27,034 కోట్లుగా ఉంది.

ఇక ఏప్రిల్, మే నెలల్లో కలిపి న్యూ బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రూ.52,427 కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లో న్యూ బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రూ.47,293 కోట్లుగా ఉంది. మొదటిసారి బీమా పాలసీల విక్రయంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించడం ఈ వృద్ధికి దారితీసింది. 

ఇదీ చదవండి: యువతకు సత్య నాదెళ్ల సూచన

ఇండివిడ్యువల్‌ సింగిల్‌ ప్రీమియం పాలసీల రూపంలో ఆదాయం 5.21 శాతం పెరిగి మే నెలలో రూ.3,525 కోట్లుగా ఉంది. జీవిత బీమా రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఎల్‌ఐసీ న్యూ బిజినెస్‌ ప్రీమియం మే నెలలో 10.27 శాతం పెరిగి రూ.18,405 కోట్లకు చేరుకుంది. మే నెలలో ఎల్‌ఐసీ గ్రూప్‌ ప్రీమియం ఆదాయం 13.79 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి గ్రూప్‌ ప్రీమియం ఆదాయం 13.66 శాతం పెరిగింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)