Breaking News

రియల్‌ ఎస్టేట్‌ జోరు..6 నెలల్లో రూ. 24,110 కోట్ల పెట్టుబడులు

Published on Fri, 07/07/2023 - 08:56

న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు గత ఆరు నెలల్లో స్వల్పంగా పుంజుకున్నాయి. జనవరి–జూన్‌ మధ్య కాలంలో దాదాపు 2.94 బిలియన్‌ డాలర్ల(రూ. 24,110 కోట్లు)కు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశీ రియల్టీపై విశ్వాసం కొనసాగడం ఇందుకు దోహదపడింది.

ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక ప్రకారం గతేడాది(2022) తొలి ఆరు నెలల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 2.88 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు లభించాయి. అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధితోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలోనూ దేశీ రియల్టీలోకి పెట్టుబడులు బలపడినట్లు నివేదిక పేర్కొంది. వెరసి పెరుగుతున్న పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది. ప్రపంచ మార్కెట్లలో ఇండియా ఆశావహంగా కనిపిస్తున్నట్లు పేర్కొంది.  

22 లావాదేవీలు 
ఈ క్యాలండర్‌ ఏడాది జనవరి–జూన్‌ మధ్య కాలంలో ప్రాపర్టీ రంగంలోకి 22 లావాదేవీల ద్వారా దాదాపు 2.94 కోట్ల డాలర్లు ప్రవహించినట్లు జేఎల్‌ఎల్‌ నివేదిక వెల్లడించింది. ఈ బాటలో ఏడాది చివరి(డిసెంబర్‌)కల్లా దేశీ రియల్టీలోకి 5 బిలియన్‌ డాలర్ల సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు లభించనున్నట్లు అంచనా వేసింది. కోవిడ్‌–19 తదుపరి కనిపిస్తున్న ట్రెండ్‌ ప్రకారం తాజా అంచనాలు ప్రకటించింది.

తొలి ఆరు నెలల్లో కార్యాలయ ఆస్తులలో పెట్టుబడులు 105.6 కోట్ల డాలర్ల నుంచి 192.7 కోట్ల డాలర్లకు జంప్‌ చేయగా.. గృహ విభాగంలో 42.9 కోట్ల డాలర్ల నుంచి 51.2 కోట్లకు ఎగశాయి. ఈ బాటలో వేర్‌హౌసింగ్‌ విభాగం 36.6 కోట్ల డాలర్లు(గతంలో 20 కోట్ల డాలర్లు), హోటళ్ల రంగం 13.4 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే డేటా సెంటర్లు, రిటైల్, విభిన్న వినియోగ ప్రాజెక్టులకు ఎలాంటి పెట్టుబడులు లభించకపోవడం గమనార్హం! గతేడాది వీటిలో వరుసగా 49.9 కోట్ల డాలర్లు, 30.1 కోట్ల డాలర్లు, 39.6 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులు నమోదయ్యాయి.

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)