Breaking News

Vestian: హౌసింగ్‌లో భారీగా సంస్థాగత పెట్టుబడులు

Published on Sat, 10/28/2023 - 05:05

న్యూఢిల్లీ: నివాస రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల (ఇనిస్టిట్యూషనల్‌) పెట్టుబడులు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు 174 మిలియన్‌ డాలర్లు (రూ.1,444 కోట్లు)తో పోల్చి చూస్తే, 71 శాతం వృద్ధితో 298 మిలియన్‌ డాలర్లు (రూ.2,473కోట్లు)గా నమోదయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ వెస్టియన్‌ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.

భారత రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ మొత్తం మీద సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 679.9 మిలియన్‌ డాలర్ల సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన 374 మిలియన్‌ డాలర్లతో పోల్చి చూసినప్పుడు 82 శాతం వృద్ధి నమోదైంది. అగ్రగామి సంస్థలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయని వెస్టియన్‌ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇది ఆఫీస్‌ వసతులకు డిమాండ్‌ను పెంచుతుందన్నారు.

ఫలితంగా రానున్న త్రైమాసికాల్లో పెట్టుబడులు పెరగొచ్చని అంచనా వేశారు. సెపె్టంబర్‌ త్రైమాసికంలో వచ్చిన సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 71 శాతం దేశీ ఇన్వెస్టర్లు సమకూర్చినవి. విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి 27 శాతం పెట్టుబడులు వచ్చాయి. సెపె్టంబర్‌ క్వార్టర్‌లో అత్యధికంగా ఇనిస్టిట్యూషనల్‌ పెట్టుబడులను నివాస ప్రాజెక్టులే దక్కించుకున్నాయి. వీటి వాటా 44 శాతంగా ఉంది. వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల్లోకి 24 శాతం పెట్టుబడులు వెళ్లాయి. ఆఫీస్‌ ఆస్తులు 164 మిలియన్‌ డాలర్లు, ఇండ్రస్టియల్‌ వేర్‌హౌసింగ్‌ ఆస్తులు 190 మిలియన్‌ డాలర్ల చొప్పున సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించాయి.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)