Breaking News

టెకీలకు గుడ్‌ న్యూస్‌: ఇన్ఫోసిస్‌ మెగా డీల్‌

Published on Tue, 08/15/2023 - 21:05

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌  భారీ డీల్‌ ప్రకటించింది. లండన్‌కు చెందిన టెలికాం సంస్థ లిబర్టీ గ్లోబల్‌తో కోట్ల రూపాయల  డీల్‌ కుదుర్చుకుంది.    ఈ మేరకు ఇరు ఒకపెంనీలు మంగళవారం సంయుక్త ప్రకటన జారీ చేసాయి. ఎనిమిదేళ్లు లేదా అంతకు మించి పొడిగించే ఎంపికతో ప్రారంభ ఐదేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇన్ఫోసిస్ ఈ ఏడాది చేసుకున్న  మూడో మెగా వ్యాపార ఒప్పందం కావడం విశేషం.  దీంతో  దేశీయ ఐటీ పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయనే  ఆనందం   ఐటీ వర్గాల్లో నెలకొంది. 

టెలికాం  డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్  కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయడానికి , స్కేల్ చేయడానికి ఐదేళ్లపాటు 1.64 బిలియన్ డాలర్ల (రూ. 13,673 కోట్లు) ఒప్పందంపై సంతకం చేశాయి. అంతేకాదు కాంట్రాక్టును ఎనిమిదేళ్లకు పొడిగిస్తే, ఇన్ఫోసిస్ లిబర్టీ గ్లోబల్‌కు 2.5 బిలియన్ల  డాలర్లు(రూ. 20,970 కోట్లు) సేవలను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కోబాల్ట్‌ను ఉపయోగించి లిబర్టీ గ్లోబల్ కోసం తాము ఏర్పాటు చేసిన క్లౌడ్-ఫస్ట్ డిజిటల్ ఫౌండేషన్‌ను పూర్తి చేయడానికి ట్రాన్స్‌ఫార్మేటివ్ ఏఐ-ఫస్ట్ సామర్థ్యాలను ప్రారంభించేలా ఈ డీల్‌  సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు.  అటు లిబర్టీ గ్లోబల్ సీఈఓ మైక్ ఫ్రైస్ కూడా ఈ ఒప్పందంపై  సంతోషాన్ని ప్రకటించారు.

కాగా ఇన్ఫోసిస్‌ మేలో, బ్రిటిష్ చమురు గ్యాస్ కంపెనీ బీపీ తో 1.5 బిలియన్ల  డాలర్ల  డీల్‌కుదుర్చుకుంది. అలాగే జూన్‌లో డాంక్సే బ్యాంక్‌తో  454 మిలియన్ డాలర్లు విలువైన ఒప్పందాన్ని చేసుకున్న సంగతి తెలిసిందే. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)