Breaking News

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌, ఆగస్టు జీతంతోనే!

Published on Wed, 08/23/2023 - 16:22

Infosys 80% average variable payout: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో సగటున 80శాతం వేరియబుల్ పేను విడుదల చేయనుంది ఆగస్టు జీతంతో కలిపి ఈ వేరియబుల్‌పేను అందించనుంది. ఈ మేరకు కంపెనీ హెచ్‌ టీం ఉద్యోగులకు ఈమెయిల్‌ సమాచారాన్ని అందిచింది.

2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'మంచి పనితీరు' నేపథ్యంలో తన ఉద్యోగులు సగటున 80శాతం వేరియబుల్ వేతనం  లభించనుంది. తాము  క్యూ1లో మంచి పనితీరును  కనబర్చామనీ,  భవిష్యత్ విస్తరణకు బలమైన పునాదిని ఏర్పాటు చేసామని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. అయితే ఉద్యోగుల పనితీరు  త్రైమాసికంలో సహకారం ఆధారంగా ఈ పే ఉంటుందని  పేర్కొంది. అలాగే పెరఫామెన్స్‌ బోనస్‌  నిర్ణారణ నిమిత్తం  తమ  బడ్జెట్ సంబంధిత DUలకు, యూనిట్ డెలివరీ మేనేజర్లకు అందించినట్టు వెల్లడించింది. గత ఏడాది ఇన్ఫోసిస్ సగటు వేరియబుల్ పే 60 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇన్ఫోసిస్ నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం పెరిగి రూ. 5,945 కోట్లకు చేరుకుంది.  డాలర్ ఆదాయం  4,617 మిలియన్ డాలర్లు వచ్చింది. త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ 20.8 శాతంగా ఉంది, క్రితం సంవత్సరం త్రైమాసికంలో 20 శాతం కంటే 80 బేసిస్ పాయింట్లు పెరిగాయి, అయితే మార్చి త్రైమాసికంలో 21 శాతం నుండి 20 బేసిస్ పాయింట్లు QoQ తగ్గింది. అంతేకాకుండా, పెద్ద డీల్ విజయాలు 2.3 బిలియన్ల డాలర్లకు పరిమితం. అలాగే   అంతకుముందు అంచనా  4-7 శాతంతో పోలిస్తే. రెవెన్యూ గైడెన్స్‌  1-3.5 శాతానికి తగ్గించింది.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు