Breaking News

ఇన్ఫోసిస్ లేఆఫ్స్: వందలాది ఫ్రెషర్స్ బయటకు

Published on Fri, 02/07/2025 - 18:22

ఇప్పుడిప్పుడే ఐటీ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయని సంబరపడుతున్న వేళ 'ఇన్ఫోసిస్' (Infosys) మరోమారు లేఆఫ్స్ బాంబ్ పేల్చింది. ఒక్కసారిగా 700 మంది ఫ్రెషర్లను ఇంటికి పంపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా అన్యాయమని లేఆఫ్‌కు గురైన ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీలో చేర్చుకున్న ఫ్రెషర్లలో 700 మంది.. మూడు సార్లు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, ఈ కారణంగానే వారిని బయటకు పంపుతున్నట్లు సమాచారం. వీరందరూ కూడా కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్‌కు చెందిన వారని తెలుస్తోంది.

కంపెనీలో ట్రైనింగ్ తీసుకునే ఫ్రెషర్స్ కచ్చితంగా.. సంస్థ నిర్వహించే అసెస్‌మెంట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే కంపనీలో కొనసాగలేరు. ఈ విషయాన్ని ఆఫర్ లేటర్లలో కూడా స్పష్టం చేశామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ విధానం ఇప్పుడు ప్రారంభించింది కాదు. గత రెండు దశాబ్దాలుగా కంపెనీ ఈ పద్దతిలోనే ఉద్యోగులను ఎంపిక చేస్తోందని పేర్కొంది.

లేఆఫ్‌లకు ప్రభావితమైన ఉద్యోగులలో చాలామంది 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందినవారు. వీరందరూ కంపెనీ మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందారు. వీరి ఇంటర్వ్యూలో పూర్తయిన తరువాత ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి కూడా కంపెనీ చాలా సమయం తీసుకుందని గతంలోనే వెల్లడైంది. ఆ తరువాత ఆఫర్ లెటర్స్ అందిస్తూ.. సిస్టమ్ ఇంజనీర్ ఉద్యోగులకు రూ. 3.2 లక్షల నుంచి రూ. 3.7 లక్షల వరకు ప్యాకేజ్ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: రీఛార్జ్‌ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..

ఇన్ఫోసిస్ కంపెనీ ఒక్కసారిగా ఫ్రెషర్లను తొలగించడంతో.. బాధితులు కంటతడి పెట్టుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తొలగించిన ఫ్రెషర్స్ 700 మందా? 400 మందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏమిటనేదే ప్రశ్న. అయితే కంపెనీ లేఆఫ్‌లను నాసెంట్ ఐటీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) విమర్శించింది. ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి.. ట్రైనింగ్ సమయంలోనే బయటకు పంపించడం అనేది సమంజసం కాదని పేర్కొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)