Breaking News

టాప్‌ టెక్‌ కంపెనీ ఉద్యోగుల జీతాలు పెంపు.. ఎంతంటే..

Published on Wed, 02/12/2025 - 18:02

దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్(Infy) 2025 ఫిబ్రవరి చివరి నాటికి వేతన ఇంక్రిమెంట్ లెటర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఏప్రిల్ నుంచి కొత్త ఇంక్రిమెంట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ఎంతశాతం వేతన పెంపు ఉంటుందో మాత్రం కంపెనీ తెలియజేయలేదు. కానీ, సగటు వేతన పెంపు 5% నుంచి 8% మధ్య ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు.

ఇన్ఫోసిస్‌ సంస్థలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. దశలవారీ వేతన సవరణలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. మొదటి దశను జనవరి 2025 నుంచి, రెండో దశను ఏప్రిల్ 2025 నుంచి పరిగణించనున్నారు. ఇంక్రిమెంట్లతోపాటు ఇన్ఫోసిస్ బ్యాచ్‌లవారీగా ప్రమోషన్ లెటర్స్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. మొదటి బ్యాచ్‌ వారికి 2024 డిసెంబర్‌లో ప్రమోషన్స్‌ లెటర్స్‌ ఇచ్చినట్లు చెప్పింది. మరొక బ్యాచ్‌కు 2025 ఫిబ్రవరి చివరిలో లెటర్స్‌ పంపించబోతున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: మెహుల్‌ చోక్సీకి క్యాన్సర్‌ చికిత్స

వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక సేవలు పొందే కంపెనీల టెక్నాలజీ మూలధన వ్యయం పెరుగుతుందని పలు ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు నిర్ణయం తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇన్ఫోసిస్‌ వేతన సవరణ చేస్తుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ జీతాలు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు సానుకూల సంకేతం. అయితే, కంపెనీ ఇటీవల మైసూరు క్యాంపస్ నుంచి దాదాపు 700 మంది ఫ్రెషర్లను తొలగించడంపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ ఉద్యోగులకు ఆఫర్‌ లెటర్‌ ప్రకటించిన తర్వాత రెండేళ్లకు కొలువులోకి తీసుకున్నారు. కానీ ఆరు నెలల్లో వీరిని ఉద్యోగంలో నుంచి తొలగించారని వాదనలున్నాయి. ఈ వ్యవహారాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం ఎన్ఐటీఈఎస్ అనైతిక చర్యగా అభివర్ణించింది.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)