Breaking News

ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్‌ క్రిస్మస్‌ కానుక

Published on Thu, 12/25/2025 - 14:22

 సాక్షి, ముంబై:  సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు క్రిస్మస్‌  కానుక అందించింది.  ఫ్రెషర్లకు ఎంట్రీ-లెవల్ జీతాలను పెంచింది,  స్పెషల్‌  టెక్నాలజీ రోల్స్‌కు ఏడాది  రూ. 21 లక్షల దాకా పరిహార ప్యాకేజీలను అందిస్తోంది. AI-ఫస్ట్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి,డిజిటల్‌గా స్థానిక ప్రతిభను ఆకర్షించేందుకు   సంస్తలో  నియామకాలను పెంచుతుంది.ఇది ఇండియాలో మిగిలిన  ఐటీ కంపెనీలతో పోలిస్తే ఇదే  అత్యధిక ఎంట్రీ-లెవల్ వేతనంగా నిలిచింది.

ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు ఆఫర్‌ ఎంత? 
మనీకంట్రోల్  అందించిన సమచారం ప్రకారం  ఇన్ఫోసిస్ 2025 ఇంజనీరింగ్  అండ్‌ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేక టెక్నాలజీ  ఉద్యోగాల ఎంపికకోసం  ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్‌ను ప్రారంభించనుంది.  దీని వార్షిక పరిహారం రూ. 7 లక్షల నుండి రూ. 21 లక్షల వరకు ఉంటుంది.

ఈ ఆఫర్‌లో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (L1 నుండి L3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ) ఉన్నాయి .అ లాగే  కంప్యూటర్ సైన్స్, ఐటీ,ఈఈఈ, ఈసీఈలాంటి ఎంపిక చేసిన సర్క్యూట్ బ్రాంచ్‌ల నుండి BE, BTech, ME, MTech, MCA ,ఇంటిగ్రేటెడ్ MSc గ్రాడ్యుయేట్‌లకు అవకాశం ఉంది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L3 (ట్రైనీ): రూ. 21 వార్షిక ప్యాకేజీని (ఎల్‌పీఏ) స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2 (ట్రైనీ): రూ. 16 LPA, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1 (ట్రైనీ): రూ. 11 LPA, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ): రూ. 7 ఎల్‌పీఏ అందిస్తుంది.

AI-ఫస్ట్ విధానంలో భాగంగా క్యాంపస్‌, ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల్లో సంవత్సరానికి రూ. 21 లక్షల వరకు ప్యాకేజీలతో ఉద్యోగులను ఎంపిక చేస్తామని ఇన్ఫోసిస్ గ్రూప్ CHRO షాజీ మాథ్యూ  తెలిపారు.

భారతదేశంలోని అగ్ర ఐటీ సంస్థలలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎంట్రీ-లెవల్ జీతాలు  దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉంది.అయితే, ప్రత్యేక నైపుణ్యాలతో వచ్చే గ్రాడ్యుయేట్ల విషయంలో ఈ ట్రెండ్ మారుతోందంటున్నారు నిపుణులు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)