Breaking News

మరో భారీ డీల్‌ను దక్కించుకున్న ఇన్ఫోసిస్‌

Published on Sun, 06/16/2024 - 17:23

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి 100 మిలియన్ డాలర్ల (రూ.850 కోట్లు) డీల్‌ను దక్కించుకుంది. హెచ్‌సీఎల్, క్యాప్ జెమినీ, డీఎక్స్‌సీ వంటి బడా కంపెనీలను దాటుకుని ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది.

ఈ ఐదేళ్ల ఒప్పందం ప్రకారం.. ఇన్ఫోసిస్ 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ డెస్క్, సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్‌ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్జ్యూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్, ఈవీపీ కర్మేష్ వాస్వానీ ఈ డీల్‌కు నేతృత్వం వహించారు. గత ఏడాది ఐటీ దిగ్గజం డాన్స్‌కే బ్యాంక్ నుంచి 454 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకుంది.

ఈ డీల్‌ కారణంగా చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, పోలాండ్, స్వీడన్, అమెరికా దేశాల్లో ఐకియాలో 350 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కు మారనున్నారు. కోల్డ్ కాలింగ్, కొన్ని ప్రారంభ కనెక్షన్లతో ప్రారంభమై వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముగిసిన మూడేళ్ల సుదీర్ఘ, సంతృప్తికరమైన ప్రయాణం అని ఇన్ఫోసిస్ కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)