Breaking News

ఇన్ఫీ18,000 వేల కోట్ల రికార్డ్‌ బైబ్యాక్‌

Published on Fri, 09/12/2025 - 00:59

న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కి అంగీకరించింది. గురువారం (11న) సమావేశమైన బోర్డు షేరుకి రూ. 1,800 ధర మించకుండా 2.41 శాతం వాటా బైబ్యాక్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించనుంది. వెరసి రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. గురువారం బీఎస్‌ఈలో ముగింపు ధర రూ. 1,510తో పోలిస్తే బైబ్యాక్‌కు 19 శాతం ప్రీమియంను నిర్ణయించింది. 

కంపెనీ 2025 జూన్‌ త్రైమాసికంలో 88.4 కోట్ల డాలర్ల (రూ. 7,805 కోట్లు) ఫ్రీ క్యాష్‌ ఫ్లోను ప్రకటించింది. కాగా.. కంపెనీ తొలిసారి 2017లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,150 ధరలో రూ. 13,000 కోట్లు వెచ్చించింది. ఆపై రెండోసారి 2019లో రూ. 8,260 కోట్లు, మూడోసారి 2021లో 9,200 కోట్లు చొప్పున షేర్ల బైబ్యాక్‌కు వినియోగించింది. ఈ బాటలో 2022లోనూ రూ. 9,300 కోట్లతో ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ. 1,850 ధర మించకుండా బైబ్యాక్‌ చేపట్టింది. 

ఇన్ఫోసిస్‌ షేరు 1.5% క్షీణించి రూ. 1,510 వద్ద ముగిసింది.  

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)