Breaking News

ఎన్నికల బాండ్లు.. ఇన్ఫోసిస్‌ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందంటే..

Published on Tue, 03/19/2024 - 12:28

ఎలక్టోరల్‌ బాండ్ల కొనుగోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్రా, ఫార్మా కంపెనీలతోపాటు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వాటిలో  ఐటీ కంపెనీలు ఉండడం విశేషం. 

తాజాగా ఎస్‌బీఐ విడుదల చేసిన ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో సియెంట్‌ కంపెనీ గరిష్ఠంగా రూ.10 కోట్లు విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఆ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందో తెలియరాలేదు. తదుపరి స్థానంలో జెన్‌సర్‌ టెక్నాలజీస్‌ మే 2019లో రూ.3 కోట్లు విలువచేసే వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మూడో స్థానంలో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ 2018 కర్ణాటక ఎన్నికల ముందు దేవెగౌడకు చెందిన జనతాదళ్‌(సెక్యూలర్‌) పార్టీకి రూ.1 కోటి విరాళం ఇచ్చినట్లు తెలిసింది.

రాజకీయ పార్టీలకు కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్‌ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఎస్‌బీఐ ఇటీవల వివరాలు వెల్లడించింది.

ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులుండవు.. ‍ప్రముఖ టెక్‌ కంపెనీ కీలక నిర్ణయం

కంపెనీల వారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు..

  • ఫ్యుచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ పీఆర్‌ రూ.1,368 కోట్లు
  • మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ రూ.966 కోట్లు
  • క్విక్‌ సప్లైచెయిన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.410 కోట్లు
  • వేదాంత లిమిటెడ్‌ రూ.400 కోట్లు
  • హల్దియా ఎనర్జీ రూ.377 కోట్లు
  • భారతి గ్రూప్‌ రూ.247 కోట్లు
  • ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.224 కోట్లు
  • వెస్ట్రన్‌ యూపీ పవర్‌ ట్రాన్సిమిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.220 కోట్లు
  • కెవెంటర్‌ ఫుడ్‌పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ రూ.195 కోట్లు
  • మదన్‌లాల్‌ లిమిటెడ్‌ రూ.185 కోట్లు
     

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)