Breaking News

ఇండస్‌ఇండ్‌లో ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు

Published on Thu, 05/01/2025 - 08:09

డెరివేటివ్స్‌ అకౌంటింగ్‌ అవకతవకల నేపథ్యంలో సీఈవో సుమంత్‌ కథ్పాలియా రాజీనామాతో కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఎగ్జిక్యూటివ్‌ల కమిటీని బోర్డు నియమించినట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు లేదా మూడు నెలల వరకు ఈ కమిటీ ఉంటుందని పేర్కొంది. దీనికి బోర్డ్‌ చైర్మన్‌ సారథ్యం వహిస్తారు. ఆడిట్‌ కమిటీ, కాంపన్సేషన్, నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ నుంచి సభ్యులు ఉంటారు. డెరివేటివ్స్‌ పోర్ట్‌ఫోలియో లెక్కింపులో తప్పుడు అకౌంటింగ్‌ విధానం కారణంగా బ్యాంకుపై సుమారు రూ. 1,960 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందనే అంచనాల నడుమ, నైతిక బాధ్యత వహిస్తూ సీఈవో మంగళవారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఏం జరిగిందంటే..

డెరివేటివ్స్‌ పోర్ట్‌ఫోలియోను లెక్కగట్టే అకౌంటింగ్‌ విధానాల్లో లోపాల కారణంగా బ్యాంక్‌ నికర విలువపై సుమారు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడొచ్చని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ గత నెల ప్రకటించడం కలకలం రేపింది. దీనిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు మార్చి 20న బ్యాంకు ఓ ప్రొఫెషనల్‌ సంస్థను నియమించింది. అంతర్గతంగా డెరివేటివ్స్‌ ట్రేడ్‌లను నమోదు చేయడంలో లోపాల వల్ల ఊహాజనిత లాభాలు నమోదు కావడమే అకౌంటింగ్‌ అవకతవకలకు దారి తీసిందని, దీనితో మొత్తం గణాంకాలన్నీ మారిపోయాయని సదరు సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.

ఇదీ చదవండి: సమస్యలు విని.. పరిష్కారాలు చెబుతోంది!

ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇంటర్నల్‌ డెరివేటివ్‌ ట్రేడింగ్‌ను బ్యాంక్‌ నిలిపివేసినప్పటికీ, అంతకన్నా ముందు 5–7 ఏళ్లుగా డెరివేటివ్స్‌ పోర్ట్‌ఫోలియో ఖాతాల్లో వ్యత్యాసాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇది అంతర్గత, ఆర్‌బీఐ ఆడిట్‌లలో కూడా బైటపడకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎండీగా సుమంత్‌ను మరో మూడేళ్ల పాటు పొడిగించాలన్న బ్యాంక్‌ ప్రతిపాదనకు ఆర్‌బీఐ నిరాకరించి, ఏడాదికే అనుమతించడం పరిస్థితి తీవ్రతపై సందేహాలు రేకెత్తాయి.
 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)