Breaking News

ఒకేరోజు 27 శాతం కుప్పకూలిన బ్యాంకు స్టాక్‌.. కారణం..

Published on Tue, 03/11/2025 - 16:34

దేశీయ ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు ధర మంగళవారం ఒక్కరోజే సుమారు 27 శాతం కుప్పుకూలింది. నిన్నటి సెషన్‌లో షేరు ధర రూ.900.5 ముగింపు నుంచి ఈ రోజు ముగింపు సమయానికి రూ.655 వద్దకు చేరింది. బ్యాంకు ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఈఓ సుమంత్ కత్పాలియా మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకుకు ఇది ‘లిట్మస్‌ టెస్ట్‌’గా అభివర్ణించారు. బ్యాంకు పాలన, నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిన కీలక పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కత్పాలియా పదవీకాలాన్ని మూడేళ్ల పాటు పొడిగించాలని బోర్డు సిఫారసు చేసినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక సంవత్సరం వరకు మాత్రమే తన పదవీకాలం పొడిగింపును ఆమోదించింది. తన నాయకత్వ నైపుణ్యాల గురించి ఆర్‌బీఐకి ఆందోళనలు ఉండవచ్చునని కత్పాలియా అన్నారు. ఏదేమైనా ఆర్‌బీఐ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బ్యాంకు షేర్‌ ధర పడిపోవడానికి కారణమైనట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఈఓ స్థాయి వ్యక్తే ఇలా తన సామర్థ్యాలను అంగీకరించడంపట్ల​ ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అయినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ మోసాల కట్టడికి వినూత్న విధానం

అంతర్గత ఆడిట్‌లో బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. ఇది డిసెంబర్ 2024 నాటికి ఉన్న లెక్కల ప్రకారం బ్యాంకు నికర విలువలో సుమారు 2.35% అంటే సుమారు రూ.1530 కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యత్యాసాలపై స్వతంత్ర సమీక్ష నిర్వహించడానికి ఇండస్ ఇండ్ బ్యాంక్ బాహ్య ఆడిటర్‌ను నియమించింది. బ్యాంక్ వృద్ధి ఎజెండా చెక్కుచెదరకుండా ఉందని, ఈ సవాళ్లను పారదర్శకంగా పరిష్కరించడానికి నాయకత్వ బృందం కట్టుబడి ఉందని కత్పాలియా వాటాదారులకు హామీ ఇచ్చారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)