Breaking News

ఇండ్‌ఇన్‌ఫ్రావిట్‌ చేతికి రోడ్‌ ప్రాజెక్టులు - డీల్ విలువ ఎంతంటే?

Published on Sat, 06/17/2023 - 07:33

ముంబై: బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి నిర్వహణలో ఉన్న నాలుగు రహదారి ప్రాజెక్టులను ఇండ్‌ఇన్‌ఫ్రావిట్‌ ట్రస్ట్‌ సొంతం చేసుకుంది. పూర్తి నగదు రూపేణా జరిగిన డీల్‌ విలువ బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ. 8,200 కోట్లు)కాగా.. కొనుగోలును పూర్తి చేసినట్లు ఇండ్‌ఇన్‌ఫ్రావిట్‌ తాజాగా వెల్లడించింది. బ్రూక్‌ఫీల్డ్‌ నిర్వహణలోని బీఐఎఫ్‌ ఇండియా హోల్డింగ్స్, కైనెటిక్‌ హోల్డింగ్స్‌ నుంచి ఐదు ప్రాజెక్టులను చేజిక్కించుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే నాలుగు ఆస్తులను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 

జాబితాలో సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై– నాసిక్‌ ఎక్స్‌ప్రెస్‌వే, కోసి బ్రిడ్జి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ చేరాయి. ఇక గోరఖ్‌పూర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ నియంత్రణ సంస్థల అనుమతులను పొందవలసి ఉండటంతోపాటు.. కొన్ని నిబంధనలు పాటించవలసి ఉన్నట్లు తెలియజేసింది. 

నిధులను రూపాయలలో కాలావ ధి రుణం, మార్పిడిరహిత డిబెంచర్లు, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్, ఓఎంఈఆర్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో యూనిట్ల జారీ ద్వారా ఏర్పాటు చేసింది. సొంతం చేసుకున్న ప్రాజెక్టులలో మూడు టోల్‌ రోడ్‌ ఆస్తులుకాగా.. ఒక యాన్యుటీ రహదారిగా కంపెనీ తెలియజేసింది. ఇండ్‌ఇన్‌ఫ్రావిట్‌ ట్రస్ట్‌ను ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్స్‌ ఏర్పాటు చేసింది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)