Breaking News

ఇండిగో దూకుడు

Published on Sat, 02/04/2023 - 06:29

న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండు విమానయాన సేవల దిగ్గజం ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 1,423 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 130 కోట్లు ఆర్జించింది. విదేశీమారక నష్టాలను మినహాయిస్తే రూ. 2,009 కోట్ల లాభం సాధించినట్లు కంపెనీ పేర్కొంది. విమానయానానికి ఊపందుకున్న డిమాండ్‌ ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఈవో పీటర్‌ ఎల్బెర్స్‌ తెలియజేశారు. మొత్తం ఆదాయం సైతం రూ. 9,480 కోట్ల నుంచి రూ. 15,410 కోట్లకు ఎగసింది.

ఒక క్వార్టర్‌కు ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని పీటర్‌ పేర్కొన్నారు. కంపెనీలో తీసుకున్న పలు చర్యలు ఫలితాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రయాణాలకు పెరిగిన డిమాండును ప్రతిఫలిస్తూ 26 శాతం అధికంగా 2.23 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. సీట్ల ఆక్యుపెన్సీ 79.7 శాతం నుంచి 85.1 శాతానికి పుంజుకుంది. 300 ఆధునిక విమానాలతో సర్వీసులందిస్తున్నట్లు తెలియజేశారు. డీజీసీఏ గణాంకాల ప్రకారం దేశీయంగా 55.7 శాతం మారెŠక్ట్‌ వాటా కలిగి ఉన్నట్లు ప్రస్తావించారు. కంపెనీ రూ. 10,612 కోట్లు చేతిలో నగదుసహా రూ. 21,925 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది. ఇదే సమయంలో రూ. 41,042 కోట్ల లీజ్‌ లయబిలిటీలతో కలిపి రూ. 44,475 కోట్ల రుణాలున్నాయి.

 ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం నష్టంతో రూ. 2,100 వద్ద ముగిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)