Breaking News

ఇండిగో కొత్త సర్వీస్.. రూ. 49తో క్యాబ్ బుకింగ్!

Published on Sat, 06/20/2026 - 17:25

ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో తన సేవలను కేవలం విమాన ప్రయాణాలకే పరిమితం చేయకుండా, ప్రయాణికుల మొత్తం ట్రావెల్ అనుభవాన్ని సులభతరం చేసే దిశగా మరో అడుగు వేసింది. ఇందులో భాగంగా 'క్యాబ్స్ విత్ ఇండిగో' (Cabs with IndiGo) అనే కొత్త ఎయిర్‌పోర్ట్ క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించింది.

ఈ సర్వీస్ ప్రధాన ఉద్దేశ్యం ప్రయాణికులకు విమానాశ్రయానికి తీసుకెళ్లడం, అక్కడి నుంచి ఇంటికి లేదా ఇతర గమ్యస్థానాలకు చేర్చడం. చాలా మంది ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలు.. చివరి నిమిషంలో క్యాబ్ క్యాన్సిలేషన్, సర్జ్ ప్రైసింగ్, లేదా క్యాబ్ అందుబాటులో లేకపోవడం. వీటన్నింటిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసింది.

ఈ సర్వీసును మోజోబాక్స్ అనే టెక్ భాగస్వామ్యంతో అందిస్తోంది. ఇది భారతదేశంలోని అనేక నగరాల్లో.. ఎయిర్ ట్రావెల్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.

ఈ సర్వీస్‌లో ముఖ్యమైన ఫీచర్స్

  • కేవలం రూ.49 నుంచే క్యాబ్ బుకింగ్ అవకాశం

  • 100 శాతం కన్ఫర్మేషన్‌తో గ్యారంటీడ్ పికప్

  • ముందుగా బుక్ చేస్తే స్పష్టమైన ధరలు

  • సర్జ్ ఛార్జీలు లేకపోవడం

  • పికప్ టైమ్ వరకు ఫ్రీ క్యాన్సిలేషన్

  • 30 నిమిషాల ఫ్రీ వెయిటింగ్ టైమ్

ఈ సౌకర్యాల వల్ల ప్రయాణికులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ సర్వీసును ఇండిగో బ్లూచిప్ లాయల్టీ ప్రోగ్రామ్‌తో కూడా అనుసంధానం చేసింది. కాబట్టి దీని ద్వారా వినియోగదారులు ప్రతి రూ.100 ఖర్చుపై 5 బ్లూచిప్ రివార్డ్స్ సంపాదించవచ్చు. అంటే విమాన ప్రయాణాలతో పాటు క్యాబ్ బుకింగ్‌లో కూడా రివార్డ్స్ పొందే అవకాశం ఉంటుంది.

ఇటీవలి కాలంలో ఇండిగో తన సేవలను విస్తరిస్తూ.. హోటల్ బుకింగ్స్, ట్రావెల్ ఎక్స్‌పీరియెన్సెస్ వంటి అనేక సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందిస్తోంది. ఇప్పుడు క్యాబ్ సర్వీస్ కూడా చేరడంతో, ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా మారింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌