విమానం దారి మళ్లింపు.. కారణం..

Published on Fri, 09/13/2024 - 16:30

ముంబై నుంచి ఫుకెట్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో శుక్రవారం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను మలేషియాలోని పెనాంగ్‌కు మళ్లించినట్లు స్పష్టం చేసింది. విమాన మళ్లింపు వార్తను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

‘ఫుకెట్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని సమాచారం అందింది. దాంతో ప్రతిస్పందనగా ముంబై నుంచి ఫుకెట్‌కు  వెళుతున్న ఫ్లైట్‌ నం 6E 1701 ఎయిర్‌క్రాఫ్ట్‌ను మార్గమధ్యలో దారి మళ్లించాం. ప్రతికూల వాతావరణానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సమీప విమానాశ్రయమైన మలేషియాలోని పెనాంగ్‌లో దించాం. ఈమేరకు ప్రయాణికులకు సమాచారం అందించాం’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఫుకెట్‌లోని వాతావరణ పరిస్థితిని సమీక్షించి తిరిగి ప్రయాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి: ‘అన్నీ అవాస్తవాలే’

ఫుకెట్‌లో 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఆకాశం మేఘావృతమై ఉందని కొన్ని సంస్థల నివేదికల ద్వారా తెలిసింది. పశ్చిమం నుంచి గంటకు 15 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతారణ పరిస్థితులు ఉన్నప్పుడు ముందస్తు సమాచారంతో విమానాలను దారి మళ్లించడం సర్వ సాధారణం. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనలు చెందకూడదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

#

Tags : 1

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)