Breaking News

వారం రోజులు.. ముంబై అష్టకష్టాలు

Published on Wed, 12/10/2025 - 12:31

ముంబై.. దేశంలో అత్యంత కీలకమైన నగరం. దీన్ని దేశ ఆర్థిక రాజధానిగా కూడా పేర్కొంటుంటారు. దేశంలోని అనేక కార్పొరేట్సంస్థలు, కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఆర్థికపరమైన కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. నేపథ్యంలో విదేశాలతోపాటు, దేశ నలుమూలల నుంచి ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు. క్రమంలో విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ముంబై నగరాన్ని ప్రభావితం చేసింది.

ఇండిగో విమాన అంతరాయాల ప్రభావం ముంబై విమానాశ్రయంలో వారం రోజులుగా ప్రయాణికులను సతాయించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 1 నుంచి 8 వరకు 905 విమానాలు రద్దు అయ్యాయి. 1,475 విమానాలు 30 నిమిషాలకు పైగా ఆలస్యమయ్యాయి. ఈ అంతరాయాల వల్ల సుమారు 40,789 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

డిసెంబర్ 4, 5 తేదీల్లో అయితే..

ముంబై ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఎనిమిది రోజులలో 3,171 విమానాలు నడపాల్సి ఉండగా కేవలం 2,266 మాత్రమే నడిపగలిగింది. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. డిసెంబర్ 1న 14గా ఉన్న విమాన రద్దులు డిసెంబర్ 5న 295కి పెరిగాయి. ఆలస్యాలు కూడా ఎక్కువయ్యి, డిసెంబర్ 3న 281 విమానాలు గరిష్ట ఆలస్యాన్ నమోదు చేశాయి.

స్తంభించిన ప్రయాణికుల బ్యాగేజీ

అంతరాయాలు పెరుగుతూనే ఉండటంతో టెర్మినళ్లలో కార్యకలాపాలు క్రమంగా స్తంభించాయి. రద్దయిన విమానాల కారణంగా సుమారు 780 చెక్-ఇన్ బ్యాగులు ప్రయాణికులకు అందకుండా నిలిచిపోయాయి. వీటిలో 90% బ్యాగులను బుధవారం నాటికి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

ఎక్కువగా ప్రభావితమైన మార్గాలు ఇవే..

ముంబై నుంచి బయలుదేరే అనేక దేశీయ మార్గాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. ప్రధానంగా అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, కొచ్చి, గోవా, లక్నో నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయంగా ఆమ్స్టర్డామ్, ఇస్తాంబుల్ మార్గాలలో కూడా పెద్ద ఎత్తున ఆలస్యాలు, రద్దులు చోటుచేసుకున్నాయి.

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు