Breaking News

ఇండిగో సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల పాట్లు!

Published on Sat, 10/05/2024 - 18:51

IndiGo Outage: ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం నుంచి తలెత్తిన సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలు, గ్రౌండ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.

చెక్-ఇన్‌లు నెమ్మదిగా సాగడంతో ప్రయాణికులు చాలా సేపు వేచిఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల భారీ క్యూలతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణాలు కిక్కిరిశాయి. దీంతో కొన్ని చోట్ల సిబ్బంది బోర్డింగ్‌ పాసులను చేత్తో రాసిస్తున్నారు. ఇండిగో సిస్టమ్‌లో తలెత్తిన లోపం కారణంగా టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామంటూ కొందరు ప్రయాణికులు వాపోయారు. తమకు ఎదురైన ఇబ్బందులను బాధిత ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ‘ఎక్స్‌’లో దీనికి సంబంధించిన పోస్టులు వెల్లువెత్తాయి.

అంతరాయంపై ఇండిగో స్పందించింది. కొనసాగుతున్న సిస్టమ్ అంతరాయం కారణంగా ప్రభావితమైన కస్టమర్‌లకు సాధ్యమైనంత మెరుగైన సహాయం, మద్దతును అందించడానికి తమ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు ‘ఎక్స్‌’లో వివరించింది.

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)