Breaking News

హోల్‌సేల్‌ ధరలూ తగ్గాయ్‌..

Published on Thu, 05/15/2025 - 07:13

న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, ఇంధనం మొదలైన వాటి ధరలు నెమ్మదించడంతో ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం తగ్గింది. టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) 13 నెలల కనిష్టమైన 0.85 శాతానికి పరిమితమైంది. గతేడాది మార్చిలో 0.26 శాతంగా నమోదైన తర్వాత డబ్ల్యూపీఐ ఇంత తక్కువ స్థాయికి దిగి రావడం ఇదే ప్రథమం. ఇది తాజా మార్చిలో 2.05 శాతంగా, గతేడాది ఏప్రిల్‌లో 1.19 శాతంగా నమోదైంది.

డేటా ప్రకారం ఆహార ఉత్పత్తుల ధరలు 0.86 శాతం, కూరగాయల రేట్లు 18.26 శాతం స్థాయిలో క్షీణించడంతో ప్రతిద్రవ్యోల్బణం నమోదైంది. సీక్వెన్షియల్‌గా విమాన ఇంధనం, కిరోసిన్‌ మొదలైన వాటి ధరలు తగ్గడంతో ఇంధనాలు.. విద్యుత్‌ రేట్లు 2.18 శాతం క్షీణించాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.62 శాతంగా నమోదైంది.

సానుకూల బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా రాబోయే నెలల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని బార్‌క్లేస్‌ ఒక నివేదికలో తెలిపింది. రుతుపవనాలు ముందే తాకడం, వర్షపాతం సాధారణ స్థాయికన్నా ఎక్కువగానే ఉండొచ్చనే అంచనాలు పంట దిగుబడులకు, ఆహార ద్రవ్యోల్బణానికి సానుకూలాంశాలని ఇక్రా సీనియర్‌ ఎకనమిస్ట్‌ రాహుల్‌ అగ్రవాల్‌ తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)