Breaking News

రియల్‌ ఎస్టేట్‌కి పెట్టుబడులు బూస్ట్‌

Published on Wed, 01/07/2026 - 13:58

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (సంస్థాగత) గతేడాది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 8.47 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు కొలియర్స్‌ ఇండియా తెలిపింది. 2024లో వచ్చిన 6.56 బిలియన్‌ డాలర్ల కంటే 29 శాతం అధికమని పేర్కొంది. ఇందులో దేశీ పెట్టుబడులు గణనీయంగా పెరగ్గా, విదేశీ పెట్టుబడులు తగ్గాయి. దేశీ ఇన్వెస్టర్ల నుంచి 4.82 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

2024లో దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2.24 బిలియన్‌ డాలర్లతో పోల్చి చూస్తే 120 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులు మాత్రం అంతకుముందు ఏడాదితో పోల్చితే 2025లో 16 శాతం తగ్గి 3.65 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ వివరాలతో కొలియర్స్‌ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. సంస్థాగత ఇన్వెస్టర్లలో ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్‌ గ్రూప్‌లు, విదేశీ బ్యాంక్‌లు, ప్రొప్రయిటరీ బుక్‌లు, పెన్షన్‌ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ, రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌–డెవలపర్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, రీట్‌లు, సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్‌ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.

‘‘2025లో అధిక శాతం పెట్టుబడులను ఆఫీస్‌ ఆస్తులు ఆకర్షించాయి. మొత్తం పెట్టుబడుల్లో 54 శాతం (4.53 బిలియన్‌ డాలర్లు) ఆఫీస్‌ ఆస్తుల్లోకి వచ్చాయి. ఆ తర్వాత నివాస ప్రాజెక్టులు, పారిశ్రామిక, గోదాముల్లోకి వెళ్లాయి’’అని కొలియర్స్‌ ఇండియా ఎండీ, సీఈవో బాదల్‌ యాజ్ఙిక్‌ తెలిపారు. 2026లో సంస్థాగత పెట్టుబడులు మరింత బలపడతాయని, అంతర్జాతీయంగా పెట్టుబడులకు రిస్క్‌ ధోరణి పెరగడం, దేశీ ఇన్వెస్టర్లు ఇందుకు మద్దతుగా నిలవనున్నట్టు పేర్కొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)