Breaking News

చైనా సీసీ కెమెరాలకు చెక్‌! ఇక కొత్త నిబంధనలు

Published on Wed, 04/01/2026 - 21:29

దేశ భద్రత, సైబర్ రక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చైనాకు చెందిన పలు కంపెనీల సీసీటీవీ (CCTV) కెమెరాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇంటర్నెట్ ఆధారిత కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 1 నుండి మారిన నిబంధనలు ఇవే..

  • ఏప్రిల్ 1 నుండి దేశంలో విక్రయించే ప్రతి ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీటీవీ కెమెరా తప్పనిసరిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన STQC (స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) ఫ్రేమ్‌వర్క్ నుండి అనుమతి పొందాలి.

  • కంపెనీలు తమ కెమెరాలలో ఉపయోగించే సిస్టమ్-ఆన్-చిప్ (SoC) లేదా ప్రాసెసర్ ఎక్కడ తయారైందో స్పష్టంగా తెలియజేయాలి.

  • ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ, హార్డ్‌వేర్ మూలం, ఫర్మ్‌వేర్ భద్రత మరియు ట్యాంపరింగ్ (ట్యాంపర్ రెసిస్టెన్స్) వంటి అంశాలపై STQC అధికారులు పరీక్షలు నిర్వహిస్తారు.

  • కెమెరా డేటాను ఇతరులు రిమోట్‌గా యాక్సెస్ చేసే అవకాశం ఉందో లేదో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

  • విదేశాల నుండి దిగుమతి చేసుకునేవే కాకుండా, భారత్‌లో అసెంబుల్ చేసే పరికరాలు కూడా ఈ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. క్లియరెన్స్ లేని ఉత్పత్తుల విక్రయం ఇకపై చట్టవిరుద్ధం.

ఏ బ్రాండ్‌లపై ప్రభావం పడుతుంది?
భారత సీసీటీవీ మార్కెట్‌లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన హిక్ విజన్ (Hikvision), టీపీ-లింక్ (TP-Link), దహువా (Dahua) వంటి ప్రముఖ చైనా కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం వీరు కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

పాత కెమెరాల పరిస్థితి ఏమిటి?
ఇప్పటికే ఇళ్లు, కార్యాలయాల్లో వాడుతున్న కెమెరాల విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రస్తుత కెమెరాలను స్వాధీనం చేసుకోదు. పాత కెమెరాలు యథావిధిగా పనిచేస్తాయి. 
అయితే, భవిష్యత్తులో ఆయా కంపెనీల నుండి వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (మరమ్మతులు) విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

ధరలు పెరుగుతాయా?
చైనా కంపెనీలకు ఆంక్షలు ఎదురైనప్పటికీ, భారతీయ బ్రాండ్లు సీపీ ప్లస్ (CP Plus), ప్రమా (Prama), క్యోబో (Kyobo), మ్యాట్రిక్స్ (Matrix), స్పర్ష్ (Sparsh) ఇప్పటికే తమ ఉత్పత్తిని భారీగా పెంచాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వీటి వాటా 80 శాతానికి చేరుకుంది. అయినప్పటికీ, భద్రతా పరీక్షల కోసం అయ్యే అదనపు ఖర్చు, సరఫరాదారుల సంఖ్య తగ్గడం వల్ల, రానున్న రోజుల్లో ముఖ్యంగా మిడ్, ప్రీమియం రేంజ్ కెమెరాల ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Videos

పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..

రికార్డు స్థాయిలో ఏపీలో మద్యం వినియోగం

తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!

మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు

అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా

నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..

అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు

వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

Photos

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)