Breaking News

చిన్న రైతులకు అ‘ధన’పు తోడ్పాటు

Published on Wed, 10/09/2024 - 14:37

చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యానికి అనదపు విలువను జోడిస్తూ వ్య‌వ‌సాయాన్ని మరింత లాభదాయకం చేయ‌డంలో కృషి చేస్తోంది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆర్య.ఏజీ’. తాజాగా రిత్ సమ్మిట్ 2.0 పేరుతో 200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPO) మరింత ఆకర్షణీయమైన, లాభదాయక సంస్థలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక స‌హ‌కారంతో సాగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చొరవను ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో రైతుల‌కు ఉత్పత్తుల నిల్వ‌, మార్కెట్‌తో పాటు రుణ సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ ఆర్య.ఏజీ సంస్థ ఎలా ఏర్పాటైంది.. రైతుల‌కు ఎలాంటి సేవ‌లు అందిస్తోంది.. టెక్నాల‌జీ ప‌రంగా పెరిగిన సౌల‌భ్యాలు.. త‌దితర అంశాల‌పై సాక్షి బిజినెస్ వెబ్ డెస్క్ ఆర్య.ఏజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌  చట్టనాథన్ దేవరాజన్‌తో ప్రత్యేక ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ సంద‌ర్భంగా వారు వెల్ల‌డించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇక్క‌డ మీ కోసం అందిస్తున్నాం.

సాక్షి: ఆర్య.ఏజీ ఎలా ఏర్పాటైంది?

నాథన్: నేను, ప్రసన్నరావు, ఆనంద్ చంద్ర అనే మరో ఇద్దరితో కలిసి ఆర్య‌.ఏజీని ప్రారంభించాం. మొద‌ట న‌ష్టాల్లో ఉన్న ఆర్య కొలేట‌ర‌ల్స్ అనే సంస్థ‌ను కొనుగోలు చేశాం. త‌ర్వాత దీన్ని ఆర్య.ఏజీ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దాం.

సాక్షి: ఆర్య.ఏజీ ఎలా ప‌ని చేస్తుంది?

నాథన్: మా సంస్థ ప్ర‌ధానంగా మూడు విభాగాలుగా ప‌నిచేస్తుంది. ఆర్య.ఏజీ కింద ఆర్య కొలేటరల్ వేర్‌హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యధన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యటెక్ ప్లాట్‌ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగాలు ఉన్నాయి. ఈ మూడింటినీ స‌మ్మిళితం చేసి రైతుల‌కు సేవ‌లు అందిస్తున్నాం.

సాక్షి: రైతుల‌కు ఎలాంటి సేవ‌లు అందిస్తున్నారు?

నాథన్:  దేశంలో అత్యధికమంది చిన్న, సన్నకారు రైతులే. వీరికి ప్ర‌ధాన స‌మ‌స్య దిగుబ‌డిని నిల్వ చేయ‌డం. ప్ర‌ధానంగా ఈ స‌మస్య‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం వేర్‌హౌస్‌ల‌ను నిర్వ‌హిస్తున్నాం. దీంతో పాటు వారికి దిగుబ‌డుల‌కు మార్కెటింగ్ క‌ల్పిస్తున్నాం. ఈలోపు అవ‌స‌ర‌మున్న రైతుల‌కు దిగుబ‌డులపై రుణ స‌దుపాయం కూడా క‌ల్పిస్తున్నాం.

సాక్షి: ఎలాంటి దిగుబ‌డుల‌కు స్టోరేజ్ క‌ల్పిస్తున్నారు..  సామ‌ర్థ్యం ఎంత‌?

నాథన్:  మాది ప్ర‌ధానంగా గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్. అంటే అన్ని ర‌కాల ధాన్యం దిగుబ‌డుల‌కు స్టోరేజ్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్ సౌక‌ర్యం క‌ల్పిస్తున్నాం. సీజ‌న్‌ను బ‌ట్టి దేశ‌వ్యాప్తంగా 3000 వేర్‌హౌస్‌ల‌ను నిర్వ‌హిస్తున్నాం. 30 లక్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం దిగుబ‌డుల‌కు స్టోరేజ్ స‌దుపాయం క‌ల్పిస్తున్నాం.

సాక్షి: ఎక్క‌డెక్క‌డ మీ కార్య‌క‌లాపాలు ఉన్నాయి?

నాథన్:  కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మిన‌హా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాం. స్థానిక సంస్థ‌లు, ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో రైతుల‌కు సేవ‌లు అందిస్తున్నాం.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)