Breaking News

గోల్డ్‌ లోన్‌ కొత్త రూల్స్‌.. రంగంలోకి ప్రభుత్వం

Published on Fri, 05/30/2025 - 21:46

దేశంలో బంగారు రుణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అత్యవసర నగదు అవసరాల కోసం లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి గోల్డ్‌ లోన్‌లే ఆధారం. అయితే, గోల్డ్‌లోన్‌ మంజూరుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రతిపాదించిన నిబంధనల మార్పులు తీవ్రమైన చర్చకు దారితీశాయి. చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే గ్రహీతలపై తీవ్ర ప్రభావం పడనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగింది.

కఠిన నిబంధనలు
గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేసే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. వీటిలో..

  • లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని 75 శాతానికి పరిమితం చేయడం అంటే రుణగ్రహీతలు తమ బంగారం మార్కెట్ విలువలో 75% వరకు మాత్రమే రుణంగా పొందవచ్చు.

  • బంగారు రుణాలకు నిజమైన, ధ్రువీకరించదగిన ఆస్తుల మద్దతు ఉందని నిర్ధారించడానికి కఠినమైన పూచీకత్తు అవసరం.

  • రుణ మంజూరులో మరింత పారదర్శకత కోసం బ్యాంకులు, రుణ సంస్థలపై పర్యవేక్షణ పెంచడం.

ప్రభుత్వ జోక్యం
అయితే, కొత్త నిబంధనలు చిన్న రుణగ్రహీతలను, ముఖ్యంగా వ్యవసాయ వర్గాలను దెబ్బతీస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది.

  • కఠినమైన నిబంధనల నుంచి రూ.2 లక్షల లోపు రుణాలను మినహాయించడం ద్వారా చిన్న రుణగ్రహీతలకు సులభంగా రుణాలు అందుతాయి.

  • కొత్త నిబంధనలకు సజావుగా మారడానికి బ్యాంకులు, రుణ సంస్థలకు తగినంత సమయం ఇవ్వడానికి వాటి అమలును 2026 జనవరి 1 వరకు వాయిదా వేయాలని ఆర్బీఐకి ఆర్థిక శాఖ సూచించింది.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)