Breaking News

భారత్‌లో ఇంధన అవసరాలు రెట్టింపు అవుతాయ్ - ముకేశ్‌ అంబానీ

Published on Mon, 12/04/2023 - 08:25

గాంధీనగర్‌: ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత ఇంధన అవసరాలు రెట్టింపవుతాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. ప్రస్తుతం 3.5 ట్రిలియన్‌ (లక్షల కోట్ల) డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్‌ 2047 నాటికి 40 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

పండిట్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌లో అసాధారణ స్థాయిలో ఆర్థికాభివృద్ధి జరగనుందని ఆయన చెప్పారు. పర్యావరణ అనుకూలమైన, సుస్థిరమైన, సమ్మిళిత అభివృద్ధిలో అంతర్జాతీయంగా దిగ్గజంగా ఎదిగేందుకు భారత్‌ మెరుగైన పరిష్కార మార్గాలను రపొందించగలదని అంబానీ ధీవ వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సామర్ధ్యాలు, నైపుణ్యాలపై నమ్మకం కలిగి ఉండాలని సూంచారు. 

‘ధైర్యమనేది అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని కూడా దాటించగలిగే పడవలాంటిది. మీరు తప్పులు చేయొచ్చు. కానీ వాటి గురిం ఆందోళన చెందుతూ, వెనుకడుగు వేయకండి. తమ తప్పులను సరి చేసుకుని, లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేసేవారే విజయం సాధిస్తారు. పెద్ద కలలు కనండి. అవే మీ జీవితాన్ని ముందుకు నడిపించే చోదకాలవుతాయి. మీ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు నిబద్ధతతో వ్యవహరించండి. రిస్కులు తీసుకోండి. కానీ నిర్లక్ష్యం వహించకండి‘ అని అంబానీ చెప్పారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)